
అలా వెకంఠపురం వేడుక నిర్వహకులపై పోలీసు కేసు
హైదరాబాద్ జనవరి 09
అలా వైకుంటాపురంలో సినిమా మ్యూజికల్ నైట్ వేడుక సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసారు. శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ యగ్ణేష్ పై కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 6 న జరిగిన వేడుకకు అనుమతి తీసుకున్న దానికన్నా ఎక్కువ మందికి పాసులు ఇవ్వడం, కార్యక్రమం రాత్రి 11:30 వరకు కొనసాగడం తో కేసుల నమోదు చేసామని పోలీసులు తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ సమస్య సైతం ఏర్పడడంతో పోలీసులకు ఫిర్యాదులందాయి.