YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం నవ్వుకోండి

పద్మపురాణం లో ఒక కథ ఉంది

పద్మపురాణం లో ఒక కథ ఉంది

పద్మపురాణం లో ఒక కథ ఉంది
ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు, ఎర దొరకలేదు, అలసిపోయి చెట్టు కింద పడుకున్నాడు. గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది. అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ ఆ పేదవాడు కలత చెందుతున్నాడని, అతని పై ఎండ వస్తోంది అని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి కూర్చుంది. వేటగాడు తన నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది. అతను నిద్రిస్తున్నప్పుడు, ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని, ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా, అతని మీద రెట్ట వేసి ఎగిరిపోయింది. అప్పుడు వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి హంసను చంపాడు. హంస కింద పడి చనిపోతూ, ఇలా అన్నది: నేను నీకు సేవ చేస్తున్నాను, నీకు నీడ ఇస్తున్నాను, నీవు నన్ను చంపావు? ఇందులో నా తప్పు ఏమిటి? అప్పుడు వేటగాడు ఇలా అన్నాడు: నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు, నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి, నీ ఆచారాలు స్వచ్ఛమైనవి, నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతో నే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేసావు, కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు, వెంటనే నీవు ఎగిరి పోయి ఉండాల్సింది. ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణ కాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకువచ్చింది. ఎల్లప్పుడూ సత్సాంగత్యం లోనే ఉండండి
తెనాలి రామలింగడి తెలివి అలాంటిది (వేదమయీ)
తెనాలి రామలింగుని కథలు.. ఎక్కువగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయని తెలుసు కదా! వీటిలో ఓ చిట్టికథ మీ కోసం... ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు. పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని? అడిగారు. నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ, ఈ మాటలతో రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక , అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు. రామలింగడి తెలివి ఎలాంటిదో చూశారు. కదా...
నీతి: క్లిష్టమైన పరిస్థితుల్ని కూడా మేథాశక్తితో జయించాలి.
 

Related Posts