YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

 మున్సిపల్ కిక్కు

 మున్సిపల్ కిక్కు

 మున్సిపల్ కిక్కు
నిజామాబాద్, జనవరి 17,
మున్సిపల్‌ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను గలగలాడి స్తుండగా, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీకి మాత్రం చికాకు తెప్పిస్తు న్నది. సంక్రాంతి సంబురాలు, మున్సిపల్‌ ఎన్నికలు ఒకే నెలలో రావడంతో సర్కారుకు డబుల్‌ ధమాకా తగిలింది. పండుగను పురస్కరించుకుని భారీగా మద్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో మున్సిపల్‌ ఎన్నికల వేడీ తగలడంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో ఓటర్లను ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన రోజు నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావావరణం వేడెక్కింది.సర్కారు సంతోషంలో ఉంటే, ఈ మూడు పార్టీలు మాత్రం నానాతంటాలు పడుతున్నాయి. మద్యాన్ని ప్రొత్సహిం చడం ద్వారా ప్రజల సొమ్మును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుంటే, రెబల్‌ అభ్యర్థులతో కాంగ్రెస్‌ , అసలు అభ్యర్థులే దొరకక బీజేపీ అవస్థ పడుతున్నాయి. టీడీపీ నామమాత్రపు పోటీకి సిద్ధమైంది. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వందల కోట్లను మూటకట్టుకుంటున్నది. పోటీచేసే అభ్యర్థులు కోట్లాది రూపాలయలు ఖర్చుపెడుతూ మున్సిపాల్టీల్లో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారు.మున్సిపల్‌ ఎన్నికలు, సంక్రాంతి పండుగ రావడంతో మరో రూ. 300 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. ఇందులో రూ. 200 కోట్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే కొనుగోలు చేసినట్టు అనధికారిక సమాచారం. మరో రెండు రోజుల్లో ఈ మొత్తం రూ. 400 కోట్లకు చేరే అవకాశమున్నట్టు ఆబ్కారీ శాఖ అధికారులు భావిస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఓటర్లకు ఇప్పటి నుంచే మందు బాటిళ్లు సరఫరా చేస్తున్నారు. మద్యం సేవించే వారి వివరాలను తీసుకుని వారికి మందు బాటిళ్లు అందిస్తున్నారు. మీ ఓటు నాకే వేయాలంటూ కోరుతున్నారు. ఇంట్లో ఓటర్ల సంఖ్యను బట్టి ఒక్కో ఇంటికి మూడు నుంచి నాలుగు బాటిళ్ల మందు చేరవేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఒక్కో వార్డులో నలుగురైదుగురు పోటీ పడుతూ భారీగా మద్యం కొనుగోలు చేస్తున్నారు. కాగా మద్యం పంపిణీలోనూ తేడా కనిపిస్తున్నది. కాస్తా పలుకుబడి గలిగిన ఓటర్లకు ఖరీదైన మద్యాన్ని సరఫరా చేస్తున్నారు.గత అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా మున్సిపల్‌ ఎన్నికలను అభ్యర్థులు సవాల్‌గా తీసుకున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే పోటీ పడుతుండటంతో ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రధానంగా వీరంతా తమ భవితవ్యం మద్యం మీదే ఆధారపడిందనే భావనలో ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీగా మద్యం కొనుగోళ్లు జరుగుతున్నట్టు సమాచారం.వరుస ఎన్నికల్లో వైఫల్యాలతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీ, తాజా ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాల్సిన దుస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తర్వాత పార్టీగా రాష్ట్రంలో నిలబడింది. అయితే ఎంపీ ఎన్నికల నాటికి ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా మూడు సీట్లు గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది. తాజాగా 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికే టీపీసీసీ మున్సిపాల్టీల వారీగా పర్యవేక్షకులను వేయడంతో పాటు స్థానిక మ్యానిఫెస్టోతోపాటు రాష్ట్ర స్థాయి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అయితే ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేయాల్సిన సమయంలో 3052 వార్డులకుగాను 5365 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే రెబల్స్‌ను బుజ్జగించే బాధ్యతను పార్టీ ఇప్పటికే స్థానిక నేతలకు అప్పగించిన సంగతి తెలిసిందే. డీసీసీ అధ్యక్షులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకు అప్పగించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే లేని ప్రాంతాల్లో ఆ బాధ్యతను మాజీలు చూస్తున్నారు. రెబల్స్‌ను గుర్తించి స్థానికంగా బుజ్జగిస్తున్నప్పటికీ మరికొంత మంది రాష్ట్ర నాయకత్వం హామిని కోరుతుండడంతో పార్టీ ప్రచారం కన్నా రెబల్స్‌ను తప్పించేందుకు ఎక్కువ సమయమిస్తున్నారు.ముఖ్యంగా పార్టీకి గెలుపు అవకాశాలున్న దక్షిణ తెలంగాణలో రెబల్స్‌ బెడద ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ ఎంపీలు ప్రాతినిథ్యం ఉన్న మల్కాజ్‌గిరి, నల్లగొండ, భువనగిరితో పాటు చేవెళ్ల, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి తదితర పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సమస్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు. స్థానికంగా బుజ్జగింపులకు లొంగని వారిని గుర్తించి రాష్ట్ర నాయకులే బుజ్జగిస్తున్నట్టు సమాచారం.

Related Posts