YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కుష్టు వ్యాధి నిర్మూలన కు కృషి చేయాలి

కుష్టు వ్యాధి నిర్మూలన కు కృషి చేయాలి

కుష్టు వ్యాధి నిర్మూలన కు కృషి చేయాలి
చిత్తూరు,జనవరి 22  
జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జె.సి.2 చంద్రమౌళి పేర్కొన్నారు. బుదువారం స్థానిక జిల్లా సచివాలయంలోని జె.సి.2 ఛాంబర్ లో జె.సి.2 స్పర్శ లెప్రసి అవేర్నెస్ క్యామ్పైన్ (30.1.2020 నుండి 13.2.2020) పై ప్రోగ్రాం అధికారులు మరియు జిల్లా స్థాయి అధికారులతో క్యామ్పైన్ ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హాజరైన జె.సి.2 మాట్లాడుతూ ఈ నెల 30 నుండి ఫిబ్రవరి 13 వ తేదీ వరకు స్పర్శ లెప్రసి అవేర్నెస్ క్యామ్పైన్ జిల్లాలో నిర్వహించనున్నామన్నారు. ఈ అవేర్నెస్ క్యామ్పైన్ ముందస్తు ఏర్పాట్లను ఎలా నిర్వహించాలో అనే దానిపై ప్రోగ్రామ్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశంను నేడు  నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబందించి అధికారులకు ఎదైతే విధులు కేటాయించామో అధికారులు ఆ విధులను తూచా తప్పకుండా నిర్వహించాలని తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 30 వ తేదీ మహాత్మా గాంధీ వర్దంతి సంధర్భంగా స్పర్శ లెప్రసి అవేర్నెస్ క్యామ్పైన్ ను జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలలో నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం పై పాటశాల విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. అధికారులందరూ సమిష్టిగా పనిచేసి ఈ  అవేర్నెస్ క్యామ్పైన్ ను విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 30 వ తేదీ జిల్లా కేంద్రంలో స్పర్శ లెప్రసి అవేర్నెస్ క్యామ్పైన్ సంధర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో ర్యాలీని కూడా నిర్వహించనున్నామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పెంచలయ్య మాట్లాడుతూ ఈ నెల 30 వ తేదీ మహాత్మా గాంధీ వర్దంతి సంధర్భంగా స్పర్శ లెప్రసి అవేర్నెస్ క్యామ్పైన్ ను నిర్వహించనున్నామని తెలిపారు. చర్మం పై స్పర్శ లేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డు గల చర్మం, చెవులపై, వీపు పై, ఎద పై నొప్పిలేని బొడిపెలు, కనుబొమ్మల మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూత పడక పోవడం, ముక్కు దిబ్బడ, ముక్కులో నుండి రక్తం కారడం, అరచేతులు, అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం తదితర లక్షణాలు ఉంటే కుష్టు వ్యాది లక్షణాలుగా అనుమానించవచ్చునని ఈ లక్షణాలు ఉన్న ఎడల మీ ఇంటి వద్దకు ఆరోగ్య కార్యకర్తలు సర్వే కి వచ్చినప్పుడు వారికి చూపించుకొనవచ్చునన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యం.డి.టి. మందులు ఉచితంగా లబిస్తాయన్నారు. తిరుపతి కి చెందిన ఎయిడ్స్ మరియు లెప్రసి అడిషనల్ డి.ఎం&హెచ్.ఓ డా.అరుణ సులోచన దేవి మాట్లాడుతూ కుష్టు వ్యాది రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. కుష్టు వ్యాది నిర్ధారణ చేసిన కేసులందరికి బహుళ ఔషద చికిత్సలను అందజేయడం జరుగుతూ ఉందన్నారు. ప్రారంబ దశలో కుష్టు వ్యాదిని గుర్తించగలిగితే అంగవైకల్యాన్ని నివారించవచ్చునన్నారు.  కుష్టు వ్యాది గ్రస్తుల పట్ల వివక్షత చూపకుండా ఉండేందుకు ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నామని తెలిపారు. చివరగా జె.సి.2. స్పర్శ లెప్రసి అవగాహన కార్యక్రమానికి సంబందించి కరపత్రాన్ని విడుదల చేసి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్, డి.పి.ఓ కార్యాలయపు ఏ.ఓ ఖాదర్ బాష, ఐ.సి.డి.ఎస్ పి.డి.ఉషా ఫణికర్, డాక్టర్ లు పెరూల్ యాదవ్, శ్రీనివాస రావు, ప్రమోద్ కుమార్, హెచ్.ఈ. కృష్ణా రెడ్డి, డిప్యూటీ డెమో శాంతమ్మ, ప్రోగ్రామ్ మరియు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts