YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఆచారి.. అదుర్స్ అనిపించిందిగా

ఆచారి.. అదుర్స్ అనిపించిందిగా

ట్రైలర్ వచ్చేసింది…సినిమా జనవరి 26న విడుదల

మంచు విష్ణు కొత్త సినిమాతో రెడీ అయిపోయాడు. ఈ నెల 26న ఆయన హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విష్ణుకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఈ సినిమాకు సంబంధించి కొత్త ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బ్రహ్మనందం చెప్పే ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా అనే డైలాగుతో పాటు అనేక ఆసక్తికర సంఘటనలు..సన్నివేశాలు ఉన్నాయి.

జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనరే ఈ ఆచారి అమెరికా యాత్ర. అనూప్ సింగ్ థాకూర్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిపబ్లిక్‌ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts