YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆరోగ్యం

సినీ నటుడు సునీల్ కు  తీవ్ర అస్వస్థత

సినీ నటుడు సునీల్ కు  తీవ్ర అస్వస్థత

సినీ నటుడు సునీల్ కు  తీవ్ర అస్వస్థత
హైదరాబాద్  జనవరి23 
టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు.   ఆయనకు వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దర్శకుడు ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హిట్టు కొట్టారు. తొలుత హీరోగా మంచి విజయాల్ని అందుకున్న సునీల్.. తరువాత ఆశించిన ఫలితాలు పొందలేకపోయారు. దీంతో పంథా మార్చుకుని.. మళ్లీ హాస్య నటుడిగా అవతారమెత్తారు. కాగా హీరోగా, కమెడియన్గా ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ప్రతినాయకుడిగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. 'కలర్ ఫోటో' అనే సినిమాలో సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సునీల్ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల అవుతొంది. తన ఆనారోగ్య విషయంపై సునిల్ స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన తెలిపారు. సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగానే ఆసుపత్రిలో చేరానని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని తెలిపారు. 

Related Posts