YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికా షట్ డౌన్ ఏమిటీ..

అమెరికా షట్ డౌన్ ఏమిటీ..

భారత్ లో కేంద్ర ప్రభుత్వం అయినా..రాష్ట్ర ప్రభుత్వాలు అయినా ఏ పని కోసం నిధులు వెచ్చించాలన్నా కూడా ప్రతి ఏటా మార్చి 31లోగా బడ్జెట్  ను ఆయా సభల నుంచి ఆమోదింపచేసుకోవాలి. లేదంటే ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా డ్రా  చేయటానికి వీలుండదు. అందుకే అన్ని ప్రభుత్వాలు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యే లోగానే బడ్జెట్ లను ఆమోదింపచేసుకుంటాయి. ఆ తర్వాత ఆయా అవసరాల కోసం వాటిని వినిగించుకోవచ్చు. ఇదే తరహాలో అమెరికాలోనూ బడ్జెట్ ను సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ సారి అమెరికాలో అది జరకపోవటంతో ప్రభుత్వ అవసరాలకు డబ్బు వాడే అవకాశం లేకుండా పోయింది. దీన్నే అక్కడ షట్ డౌన్ అంటారు. ప్రభుత్వపరంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టే అవకాశం లేకపోవటంతో ఇలా వ్యవహరిస్తారు.

అమెరికా షట్ డౌన్..అఫీషియల్

అనుకున్నట్లే జరిగింది. అమెరికా షట్ డౌన్ అయింది. సెనేట్ అమెరికాకు చెందిన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.ఫిబ్రవరి 16 వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. అత్యవసర సేవలు అయిన జాతీయ భద్రత, విపత్తు సహాయం వంటి పనులకు మాత్రమే నిధులు  ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. మిగిలిన ఎలాంటి వాటికి ప్రభుత్వ నిధులు వాడే అవకాశం లేకుండా పోతుంది ఈ పరిణామంతో. గత 25 సంవత్సరాల కాలంలో ఇది నాలగవ షట్ డౌన్. ప్రభుత్వ పనుల కోసం బడ్జెట్ లేకపోవటంతో ఉద్యోగుల వేతనాలు సహా ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు ఏమీ ముందుకు సాగే అవకాశం లేదు. బిల్లు ఆమోదానికి సంబంధించి రిపబ్లికన్లు, డెమెక్రాట్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యంకాకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ఉద్యోగులకు 40 రోజుల పాటు వేతనం లేని సెలవులు మంజూరు చేయనున్నారు.

Related Posts