YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం నవ్వుకోండి దేశీయం

బడ్జెట్ పై మీమ్స్

బడ్జెట్ పై మీమ్స్

బడ్జెట్ పై మీమ్స్
హైద్రాబాద్, ఫిబ్రవరి 1
మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా రెండోసారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధితోపాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, చిన్నారుల సంక్షేమం ప్రధాన అంశాలుగా ఈ బడ్జెట్‌ను సమర్పించారు.కొత్తగా ఏర్పాటుచేసిన కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్‌కు రూ.30,757 కోట్లు, లడఖ్‌కు రూ.5,598 కోట్లు కేటాయించడం గమనార్హం. ఈసారి వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయపు పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య ఆదాయంపై విధిస్తున్న పన్నును 20 నుంచి 10 శాతానికి తగ్గించారు. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతానికి, రూ.12.50 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల వరకు 25 శాతం, రూ.15 లక్షలు ఆపై ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను వసూలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పన్ను శ్లాబ్‌లను నాలుగు నుంచి ఏడుకు పెంచారు.సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం: బడ్జెట్ సందర్భంగా సోషల్ మీడియాలో మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ మీమ్స్ రూపొందించారు. ఈ సెటైర్లను చూస్తే మీరు కూడా కడుపుబ్బా నవ్వుకుంటారు. ఆ మీమ్స్‌ను ఇక్కడ చూసేయండి మరి.

Related Posts