YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ నేతలు ఇద్దరు ఆల్ హ్యాపీసేనా...

ఆ నేతలు ఇద్దరు ఆల్ హ్యాపీసేనా...

విశాఖపట్టణం, మే 1, 
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మధ్య రేగిన వివాదాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మలుపు తిప్పారు. ప్రజా ఫిర్యాదులపై ఏర్పడిన శాసనసభ కమిటీ సమావేశాన్ని విశాఖలో ఏర్పాటు చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కూటమి పార్టీలోని ఇద్దరు నేతలతో సమావేశమయ్యారు.వారిద్దరితో అసలేం మాట్లాడారో..? ఎలా సర్ది చెప్పారో కానీ, రెండు రోజుల క్రితం చిర్రుబుర్రులాడిన గంటా.. ఎమ్మెల్యే విష్ణుతో చేతులు కలిపారు. దీంతో ఆ ఇద్దరి మధ్య చెలరేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని చర్చ జరుగుతోంది. ప్రజా ఫిర్యాదులపై ఏర్పడిన శాసనసభ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామక్రిష్ణంరాజు తొలి సమావేశాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో రఘురామతోపాటు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు, జగన్మోహన్, కొణతాల రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం విశాఖ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు గంటా, విష్ణుకుమార్ రాజు మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఇది జరిగిన రెండు రోజులకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఎంట్రీతో ఆ ఇద్దరి మధ్య గొడవకు శుభం కార్డు పడిందని అంతా చెబుతున్నారు. కూటమిలో ఉంటూ విపక్షంలా వ్యవహరించడం సరికాదన్న రీతిలో ఇద్దరూ ఇప్పుడు ఒక్కటైపోయారంట. పార్టీలు వేరైనా కూటమిలో కలిసికట్టుగా ఉంటూ విశాఖ అభివృద్ధి కోసం పాటుపడాలని ఇద్దరు సీనియర్ నేతలు కోరుకుంటున్నారని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.విశాఖ ఫిల్మ్ నగర్ భూముల లీజు విషయంలో స్థానిక ఎమ్మెల్యే గంటాకు తెలియకుండా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మిగిలిన ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం పంపడం వివాదానికి దారితీసింది. ఈ అంశంపై విశాఖ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా కలుసుకున్న విష్ణు, గంటా.. ఫిల్మ్ నగర్ లీజుల విషయంపై బహిరంగంగా వాదులాడుకున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు క్షమాపణ చెప్పినా, గంటా తీవ్ర మనస్థాపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.విశాఖ ఫిలింనగర్ క్లబ్ కు గత ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమికి సంబంధించి కలెక్టర్ ను కలిసి విష్ణుకుమార్ రాజు లేఖ ఇవ్వడంపై గంటా మండిపడ్డారట. తన సంతకం లేకుండా తన నియోజకవర్గానికి సంబంధించిన అంశంపై కలెక్టర్ కు లేఖ ఎలా ఇస్తారంటూ విష్ణుపై గంటా ఆగ్రహం వ్యక్తం చేశారట.దీనిపై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ…ఫిల్మ్ క్లబ్ కు కేటాయించిన భూమి అలాట్ మెంట్ లెటర్లో 33 ఏళ్లు అనేది మిస్సయ్యిందని…దీనిపై కరెక్షన్ చేయడానికే కలెక్టర్ ని కలిసి లేఖ ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సంతకం తీసుకుని కలెక్టర్ కి ఇవ్వాలని..అలా జరక్కపోవడంతో గంటాకు విష్ణు సారీ కూడా చెప్పారట. దీంతో ఇద్ధరి మధ్య తలెత్తిన విబేధాలు, రఘురామ ఎంట్రీతో సద్దుమణిగినట్టేనని అంటున్నారు. విష్ణు వర్సెస్ గంటా మధ్య గొడవలు ఇప్పటివి కావని..ఎప్పటినుంచో ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోందన్న చర్చ విశాఖ జిల్లా రాజకీయాల్లో నడుస్తోంది. ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే. దాన్ని ఆయన కంచుకోటగా మార్చుకున్నారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ-బీజేపీ అభ్యర్థిగా రాజు గెలుపొందారు.ఆనాటి నుంచి నియోజకవర్గంలో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయట. 2019లో అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు, టీడీపీ నుంచి గంటా, వైసీపీ నుంచి కేకేరాజు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గంటా విజయం సాధించారు. ఆ తర్వాత గంటా, రాజుకు మధ్య మాటలయుద్ధం తారస్థాయిలో ఉండేదట. ఒకరినొకరు ముఖం చూసుకోని స్థాయికి వెళ్లిపోయాయని వారి సన్నిహితుల మధ్య టాక్ విన్పిస్తోంది.అయితే, నిన్నటి వరకు కయ్యానికి కాలుదువ్విన ఇద్దరు నేతలు..ఇప్పుడు ఆల్ హ్యాపీస్ అంటూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నా, లోలోపల మాత్రం మంట రగులుతూనే ఉంటుందని ఆ నియోజకవర్గం నేతలు మాత్రం గుసగుస లాడుకుంటున్నారట. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో..ఇలాగే కలిసిమెలిసి ఉంటారా లేక మళ్లీ రోడ్డెక్కి రచ్చ చేస్తారా అనేది చూడాలి.

Related Posts