YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 కరోనా వైరస్ పై విద్యార్థులకు అవగాహన

 కరోనా వైరస్ పై విద్యార్థులకు అవగాహన

 కరోనా వైరస్ పై విద్యార్థులకు అవగాహన
 నెల్లూరు ఫిబ్రవరి 5  
నగరంలోని స్థానిక రామ్మూర్తి నగర్, కార్నల మిట్ట , మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు నిత్య వాణి పౌండేషన్ మరియు సింహపురి స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  ఎపిడమిక్ సెల్ డాక్టర్ గౌస్ మొహియుద్దీన్ మాట్లాడుతూ తూ కరోనా వైరస్ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కరోనా వైరస్ ను మొదట చైనా దేశంలోగుర్తించారని ఈ వ్యాధి వందలాది మంది ప్రజల ప్రాణాలను తీసిందని, చైనా దేశం నుండి కేరళ రాష్ట్రానికి ఈ  కరోనా వైరస్ పాకినట్లు అధికారికంగా సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు .చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవాలని, మాంసాహారం, గ్రుడ్లను బాగా ఉడకబెట్టి తినాలని జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు నుండి నీరు కారడం వంటివి వచ్చినప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించాలని, కరచాలనం చేయకూడదని ,జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలలో మాస్కులు ధరించాలని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో నిత్య వాణి ఫౌండేషన్ కార్యదర్శి బొప్పూరు విజయ మోహన్ రావు, కర్నాల మిట్ట స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి రమేష్ బాబు, ఇడ్స్ సంస్థ కార్యదర్శి ఎం సుధాకర్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కుసుమ కుమారి ,విక్రమ సింహపురి స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts