YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆస్తి-పాస్తులు తెలంగాణ

 గ్రేటర్ లో పన్నుల బాదుడు

 గ్రేటర్ లో పన్నుల బాదుడు

 గ్రేటర్ లో పన్నుల బాదుడు
హైద్రాబాద్, ఫిబ్రవరి 8,
మహానగర పాలక సంస్థ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లు అస్తవ్యస్తంగా తయారైంది. అధికారుల అవగాహన లోపం, క్షేత్ర స్థాయి విధుల నిర్వహణలో తలెత్తిన చిత్తశుద్ధి లోపం కారణంగా పేద, మధ్య తరగతికి చెంది చిన్నచిన్న వ్యక్తిగత నివాసాలపై ఎడాపెడా పన్ను వడ్డిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని నగరంలోని మధ్య తరగతి ప్రజలపై మోపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కలెక్షన్ పెంచుకునేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1800 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి సుమారు రూ.1200 కోట్లను వసూలు చేసుకున్నారు. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నందున ఇచ్చిన టార్గెట్ ప్రకారం రూ.1800 కోట్లు వసూలు చేయాల్సిందేనని సర్కిళ్లు, జోన్ల వారీగా ఉన్న ట్యాక్సు సిబ్బందికి టార్గెట్లు విధించటంతో అధికారులు ప్రస్తుతమున్న ఆస్తిపన్ను ఖాతాలకు ఇష్టారాజ్యంగా పన్ను వడ్డిస్తున్నారు. 1994కు ముందు నగరంలో నిర్మితమైన భవనాల నిర్మాణంలో ఉన్నా, ఎలాంటి జరిమానాల్లేకుండా ఆస్తిపన్ను విధించి, అందులో పది శాతం రాయితీ ఇవ్వాలన్న నిబంధన ఉన్నా, అలాంటి భవనాలకు సైతం అధికారులు ఇపుడు పన్ను పెంచి వడ్డిస్తున్నారు. ఇక 2006కి ముందు నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందకముందు శివార్లలోని పనె్నండు మున్సిపాలిటీల్లో జీప్లస్ రెండు, మూడు అనుమతులు తీసుకుని, గ్రౌండ్ ఫ్లోర్, జీప్లస్ వన్ నిర్మించిన రెసిడెన్షియల్ భవనాలకు కూడా జీప్లస్ వన్, టూ అంటూ భారీగా పన్న పెంచేస్తున్నారు. హయత్‌నగర్ సర్కిల్‌లో ఇలాంటి ఘటనే ఇటీవలే వెలుగులోకి వచ్చింది. జీప్లస్ వన్ పర్మిషన్ తీసుకుని, కేవలం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంటిని నిర్మించుకున్న యజమానికి జీప్లస్ భవనమంటూ అదనంగా మరో అంతస్తుకు అధికారులు పన్ను విధించటం వారి అవగాహనకు నిదర్శనం.చివరకు ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తనకున్న ఇళ్లు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనని రుజువు చేసుకున్న సదరు ఇంటి పన్నును సీఎం ప్రకటించిన స్కీం కింద కేవలం తక్కువ విధించాల్సి ఉండగా, జీహెచ్‌ఎంసీ అధికారులు అందుకు అదనంగా వేల రూపాయలను చెల్లించాలని మళ్లీ నోటీసులు జారీ చేయటంతో యజమాని లబోదిబోమంటున్నారు.అసెస్‌మెంట్ కోసం దరఖాస్తు పెట్టుకున్న తర్వాత సదరు భవనాన్ని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, దాని వినియోగం, తీసుకున్న అనుమతి ప్రకారం నిర్మించారా లేదంటే ఉల్లంఘించారా, ఒకవేళ అనుమతిని ఉల్లంఘించి నిర్మిస్తే, ఎంత శాతం ఉల్లంఘించారన్న విషయాలను పరిశీలించి, డీవియేషన్స్ పది శాతం దాటితే విధించాల్సిన పన్నుకు వంద శాతం అదనంగా జరిమానా వేసి పన్నును నిర్ణయించాల్సి ఉంది. కానీ, పలు సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లు, వ్యాల్యుయేషన్ ఆఫీసర్లు కొత్తగా అసెస్‌మెంట్ చేయాల్సిన భవనాలకు సంబంధించి ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, బిల్ కలెక్టర్ చెప్పిన విధంగా పన్ను విధించి, ఇంటి యజమానులను ఇబ్బందుల పాల్జేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అన్ని సక్రమంగా ఉండి, తీసుకున్న అనుమతి ప్రకారమే, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా నిర్మించిన భవనాలకు సంబంధించి అసెస్‌మెంట్ చేసే విషయాన్ని ట్యాక్సు సిబ్బంది పట్టించుకోవటం లేదు. నిర్మాణంలో ఎలాంటి డీవియేషన్స్ లేవన్న విషయాన్ని నిర్దారిస్తూ జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు జారీ చేసినా, తమకు అది ప్రామాణికం కాదని ట్యాక్సు సిబ్బంది వ్యాఖ్యానించటం గమనార్హం. ఎలాంటి డీవియేషన్స్ లేకున్నా, తమ సంగతేంటీ అంటూ యజమానుల వద్ద డిమాండ్ చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Related Posts