YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు ఆంధ్ర ప్రదేశ్

పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు      

పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు      

పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు      
తిరుపతి  ఫిబ్రవరి 10 
టిటిడి ఉద్యోగుల క్రీడలు పోటాపోటీగా జరుగుతున్నాయి. సోమ‌వారం జరిగిన పోటీల్లో గెలుపొందినవారి వివరాలిలా ఉన్నాయి.
చెస్ -
- టిటిడి సీనియర్ పురుష‌ అధికారుల చెస్ సింగల్స్ పోటీల్లో శ్రీ మ‌ల్లీకార్జున ప్ర‌సాద్ విజ‌యం సాధించగా,  టి.వి.స‌త్య‌నారాయ‌ణ రన్నరప్‌గా నిలిచారు.     
బ్యాడ్మింటన్ -
- 50 ఏళ్లు పైబడిన పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో  కె.ఎస్‌.బాల క్రిష్ణ‌ జ‌ట్టు విజయం సాధించగా,  వి.భాస్క‌ర్‌ జ‌ట్టు రన్నరప్‌గా నిలిచారు.
క్యారమ్స్‌-
- 40 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల క్యారమ్స్ సింగల్స్ పోటీల్లో ఎం.శ్రీ‌ల‌క్ష్మి విజ‌యం సాధించగా,  కె.సౌజ‌న్య రన్నర్‌గా నిలిచారు. క్యారమ్స్ డ‌బుల్స్ పోటీలలో ఎం.శ్రీ‌ల‌క్ష్మి, జి.చిన్న‌మున్నెమ్మ‌          విజయం సాధించగా, ఎన్‌.జాన‌కి, జి.మ‌నో చైత్ర రన్నరప్‌గా నిలిచారు.
టెన్నికాయిట్ -
- 41 నుంచి 50 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల టెన్నికాయిట్‌ సింగిల్స్‌ పోటీలలో ఎన్‌.సుధారాణి,         విజయం సాధించగా, టి.రాజేశ్వ‌రి రన్నరప్‌గా నిలిచారు. టెన్నికాయిట్‌ డబుల్స్‌ పోటీలలో ఎన్‌.సుధారాణి, టి.రాజేశ్వ‌రి జట్టు విజయం సాధించగా, జి.నాగ‌మ‌ణి, పి.స్వ‌ప్న జట్టు రన్నరప్‌గా నిలిచారు.

Related Posts