YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆస్తి-పాస్తులు తెలంగాణ

 ప్రకటనే.. పనిచేయరు.

 ప్రకటనే.. పనిచేయరు.

 ప్రకటనే.. పనిచేయరు..(కరీంనగర్)
కరీంనగర్, ఫిబ్రవరి 10  అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి మున్సిపల్ శాఖ అవకాశం ఇచ్చినా దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అనుమతులు పొంది కొత్తగా ఇళ్ల నిర్మాణం చేసుకోవాలనుకున్న వారికి అవస్థలు మొదలయ్యాయి. దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లోనే చేయగా, ఇప్పుడు వాటిని పరిశీలించడానికి ఆన్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం జరుగుతోంది. జిల్లాలోని కరీంనగర్‌ నగరపాలక సంస్థతో పాటు హుజురాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాలకు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు చొప్పదండి, కొత్తపల్లి పరిధిలో అక్రమ, అనధికారిక లే అవుట్లను సక్రమం చేసుకోవడానికి పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. వీటి పరిధిలోని ఖాళీ స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ లేకపోవడంతో వాటికి పట్టణ ప్రణాళిక ద్వారా అనుమతులు జారీ చేయలేదు. భవనాలు నిర్మించుకోవాలని వచ్చిన దరఖాస్తుదారులకు నానా అవస్థలు పడ్డారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇష్టానుసారంగా ప్లాట్లను చేసి విక్రయించడం, ఆ ప్లాట్లకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కొనుగోలు చేసిన స్థల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి పురపాలక శాఖ 90 రోజుల గడువు విధించింది. కొత్త మున్సిపాలిటీలకు, విలీన గ్రామాలకు గత నెల 28 వరకు అవకాశం ఇచ్చారు. వీరంతా 2018 మార్చి 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న లే అవుట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు రూ.10వేలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని అనుమతులు జారీ చేసే సమయంలో పట్టణ ప్రణాళిక విభాగానికి చెల్లించాల్సి ఉంటుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో రాగా వీటిని క్రమపద్ధతిలో పరిష్కరించాల్సి ఉంటోంది. ఆయా లైసెన్స్‌ సర్వేయర్లు ద్వారా దరఖాస్తుదారులను ఆన్‌లైన్‌ చేసిన దరఖాస్తుదారులు.. వాటిని పరిష్కరించడానికి పట్టణ ప్రణాళిక అధికారులకు మాత్రం ఆన్‌లైన్‌ అనుమతి ఇవ్వడం లేదు. దాంతో దరఖాస్తుదారుడి దరఖాస్తును ఏవిధంగా పరిశీలించి అనుమతి ఇవ్వాలనే విషయంలో పట్టణ ప్రణాళిక అధికారులకు తలనొప్పిగా మారింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఏం జత చేశారు? ఇంకేం అవసరం ఉంటుందో గుర్తించి దరఖాస్తుదారుల నుంచి ఫీజు మొత్తాన్ని చెల్లించడానికి అవకాశం ఉండగా ఇప్పటికీ ఆన్‌లైన్‌ అందుబాటులో రావడం లేదు. కొత్త మున్సిపాలిటీలతో పాటు విలీన గ్రామాల్లోని లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు చేసుకొని రోజులు గడుస్తున్నా కనీసం సమాచారం ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇళ్లను నిర్మించుకోవడానికి మంచి ముహూర్తాలు ఉండటం, అనువైన వాతావరణం ఉండటంతో దరఖాస్తుదారులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నా పరిష్కరించేందుకు పురపాలక శాఖ నుంచి ఆన్‌లైన్‌ ‘కీ’ రావడం లేదు. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు అవకాశం ఇవ్వగా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దీని గడువు కొద్ది రోజులు పెంచితే మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ముగుస్తున్న గడువు విషయం తెలియకపోవడంతో కొందరు దరఖాస్తు చేసుకోలేక పోయారు. ఇప్పటికైనా పురపాలక శాఖ గుర్తించి ఎల్‌ఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, విలీన గ్రామాలకు నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేసుకోవడానికి ఇన్నాళ్లు ఇబ్బందులు వస్తున్నాయి. వీటిని అధిగమించేందుకు పురపాలక శాఖ అక్రమ, అనధికారిక ఖాళీ స్థలాలు క్రమబద్ధీకరించడానికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. దరఖాస్తులు, ఫీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అభివృద్ధికి వినియోగించుకునే అవకాశం ఉంది. ఏ ప్రాంతం నుంచి అధిక ఆదాయం వస్తుందో అందులో సగం మేర నిధులు అదే ప్రాంతంలో కనీస సౌకర్యాలు మెరుగు పర్చుకోవడానికి వీలు కలుగుతుంది.

Related Posts