YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

పడిపోయిన చైనీస్ ఫుడ్ అమ్మకాలు

పడిపోయిన చైనీస్ ఫుడ్ అమ్మకాలు

పడిపోయిన చైనీస్ ఫుడ్ అమ్మకాలు
వరంగల్, ఫిబ్రవరి 14,
ప్రపంచాన్ని కోవిడ్- 19 వైరస్ ప్రభావం నగరంలోని చైనీస్ ఫాస్ట్ఫుడ్, రెస్టారెంట్ల మీద పడింది. ముఖ్యంగా మాంసాహారం తీసుకుంటే ఈ వైరస్ సోకుతుందన్న పుకార్లు షికారు చేయటంతో చైనీస్ ఫుడ్ తినేందుకు నగరవాసులు జంకుతున్నారు. కానీ నగరంలో వడ్డించే చైనీస్ ఫుడ్‌కు సంబంధించి చైనా నుంచి ఎలాంటి సరుకులు నగరానికి రాకపోయినా, చైనాలో కోవిడ్- 19 వైరస్ పుట్టినందుకు నగరంలోని పలు ఫాస్టు ఫుడ్ సెంటర్లలో చైనీస్ ఫుడ్‌కు ఆదరణ తగ్గింది. కానీ కోవిడ్- 19 వైరస్‌పై నగరవాసుల్లో నెలకొన్న అవగాహన లోపం కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయే తప్ప, చైనీస్ ఫుడ్‌లో కోవిడ్- 19 వైరస్ ఉండే అవకాశం లేదని వ్యాపారులంటున్నారు. ముఖ్యంగా చైనీస్ ఫుడ్‌లోని మాంసాహార డిష్‌లకు ఆర్డర్‌చ్చేందుకు జనం భయపడిపోతున్నారు. ముఖ్యంగా చైనీస్ ఫాస్టు ఫుడ్ డిష్‌లను వంట చేసేందుకు అవసరమైన అన్ని సరుకులు నగరంలోని లభ్యమవుతున్నా, డిష్‌లు వంట చేసే తీరు, చైనీస్ ఉప్పు, టేస్టు ఫౌడర్‌లతో ఈ వైరస్ సోకుతుందేమోనన్న భయం నగరవాసులను వణికిస్తోంది. ముఖ్యంగా కోళ్లకు కూడా సరికొత్త వైరస్ వచ్చిందని, ఈ వైరస్ సోకిన కోళ్లు క్షణాల్లో మరణిస్తున్నాయని  సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టడటంతో ప్రజల్లో కొద్దిరోజుల క్రితం వరకు కరోనా వైరస్ పై ఉన్న భయం మరింత రెట్టింపయందని చెప్పవచ్చు. ఈ దెబ్బతో చైనీస్‌లో చికెన్‌తో తయారు చేసే చికెన్ 65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్ రైస్ వంటివి ఆర్డరిచ్చేందు జనం భయపడుతున్నారు. ఇదే భయంతో చికెన్ విక్రయాలు కూడా బాగా తగ్గాయి. కొద్దిరోజుల క్రితం వరకు రూ. 190, రూ.200 ఆపై కూడా ధర పలికిన కిలో చికెన్ ఇపుడు కేవలం రూ. 130 నుంచి రూ. 150కి పడిపోయింది. నగరవాసుల్లో నూటికి  సుమారు 60 నుంచి 70 శాతం మంది నాన్‌వెజ్ తినాలనుకుంటే, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే చికెన్ ఇపుడు మరింత దిగొచ్చింది. కరోనా భయంతో చికెన్ కొనుగోళ్లు, ఇళ్లలో వండుకోవటం వంటివి తగ్గాయి. కానీ చికెన్ తింటే ఎలాంటి వైరస్ రాదని పశుసంవర్థక శాఖకు చెందిన కొందరు అధికారులంటున్నారు. వైరస్ భయంతో గడిచిన పక్షం రోజుల నుంచి ఫాస్టు ఫుడ్ విక్రయాలు యాభై శాతం తగ్గినట్టు ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకులు వాపోతున్నారు.

Related Posts