YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ 
 వ‌చ్చిన అతి త‌క్కువ వ్య‌వ‌థిలోనే హీరోగా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌...ప్ర‌స్తుతం యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న. కుర్ర హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను న‌టించిన చిత్రాల్లో ఏడు మాత్ర‌మే విడుద‌ల‌య్యాయి. అందులో `పెళ్ళిచూపులు`, `అర్జున్‌రెడ్డి`, `గీత గోవిందం` సినిమా సూప‌ర్‌సక్సెస్‌ల‌య్యాయి. మిగిలిన చిత్రాలేవీ ఆద‌ర‌ణ పొంద‌క‌పోయినా విజ‌య్‌కి యూత్‌లో క్రేజ్ త‌గ్గలేదు. ఈ క్రేజ్ కార‌ణంతోనే ప్రేమ‌క‌థా చిత్రాల్లోనే కాస్త డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి విజ‌య్ ప్ర‌య‌త్నిస్తుంటాడు. అలాంటి ఈ కుర్ర హీరో ఇదే త‌న చివ‌ర ప్రేమ‌క‌థా చిత్ర‌మంటూ ప్రేమికుల‌రోజైన ఫిబ్ర‌వ‌రి 14న `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అస‌లు ఈ `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` క‌థేంటి?  హీరో, నలుగురు హీరోయిన్స్‌తో చేసిన రొమాన్స్ ఏంటి?  చివ‌ర‌కు ఈ ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా ఏం చెప్పాల‌నుకున్నాడు?  అనే విష‌యాలు తెలుసుకోవాంటే రివ్యూలోకి వెళ‌దాం..

.గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశీ ఖన్నా) ప్రేమికులు. సహజీవనం చేస్తుంటారు. పెద్ద రచయిత కావాలనేది గౌతమ్ లక్ష్యం. అందుకని, గొప్ప జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి... ప్రతిరోజు ఇంట్లో ఏదో రాయాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఏమీ రాయడు. కొన్ని రోజులకు గౌతమ్ ప్రవర్తనపై యామినికి విసుగు వస్తుంది. బ్రేకప్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ బ్రేకప్ బాధలో గౌతమ్ ఏం చేశాడు? సీనయ్య (విజయ్ దేవరకొండ), సువర్ణ (ఐశ్వర్య రాజేష్), స్మిత మేడమ్ (కేథరిన్) కథకు, గౌతమ్-యామిని కథకు సంబంధం ఏమిటి? అసలు, గౌతమ్ పారిస్ ఎందుకు వెళ్ళాడు? అక్కడ అతడికి పరిచయమైన ఇజ (ఇజబెల్లా) ఎవరు? చివరికి,  గౌతమ్ - యామిని కలిశారా? లేదా? మధ్యలో గౌతమ్ జైలుకు ఎందుకు వెళ్లాడు? అనేది సినిమా.

మలో త్యాగం ఉంటుంది. ప్రేమలో రాజి తత్వం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుంది. ప్రేమలో ఒకరిపై మరొకరికి అంతులేని ఆరాధన ఉంటుందనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించారు. బ్రేకప్ తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన మనోవేదన అనుభవిస్తారనేది చూపించారు. సినిమా ప్రారంభమే విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా బ్రేకప్ ఎపిసోడ్ తో ప్రారంభమౌతుంది. తర్వాత ఇల్లందు నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే ఎపిసోడ్ వినోదాత్మకంగానూ, అదే సమయంలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతోనూ దర్శకుడు తెరకెక్కించారు. పారిస్ ఎపిసోడ్ లో అక్కడి అందాలను తెరపై అందంగా ఆవిష్కరించారు. అందులో కథానాయకుడు చేసే త్యాగం కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది. చిత్రంలో విజయ్ దేవరకొండ నాలుగు విభిన్న గెటప్పుల్లో కనిపించాడు. రాశీ ఖన్నాతో బ్రేకప్ ఎపిసోడ్ లో అతడి గెటప్ 'అర్జున్ రెడ్డి' సినిమాలో గెటప్ ను గుర్తు చేస్తుంది. అంతకుముందు కాలేజ్ ఎపిసోడ్ లో యువకుడిగా మెప్పించారు. ఇల్లందు నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ అయితే నటుడిగా విజయ్ దేవరకొండలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. బొగ్గు గని కార్మికుడిగా, పదో తరగతితో చదువు ఆపేసిన యువకుడిగా... గ్రామీణ తెలంగాణ వాతావరణంలో యువకులు ఎలా ఉంటారో అలాగే కనిపించారు. పారిస్ ఎపిసోడ్ లో స్టైలిష్ గా ఉన్నాడు. 

స‌మర్ప‌ణ‌:  కె.ఎస్‌.రామారావు

బ్యాన‌ర్‌: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌

తారాగ‌ణం:  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, క్యాథ‌రిన్ ట్రెసా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, ఇజబెల్లా లెయితె త‌దిత‌రులు

సంగీతం:  గోపీ సుంద‌ర్‌

కెమెరా: జ‌య‌కృష్ణ గుమ్మ‌డి

ఎడిటింగ్‌:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

నిర్మాత‌లు:  కె.ఎ.వ‌ల్ల‌భ‌

ద‌ర్శ‌క‌త్వం: క‌్రాంతి మాధ‌వ్‌

Related Posts