YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సెన్సెస్ సర్వేలో అధికారులు విధులను తూచా తప్పకుండా నిర్వహించాలి

సెన్సెస్ సర్వేలో అధికారులు విధులను తూచా తప్పకుండా నిర్వహించాలి

సెన్సెస్ సర్వేలో అధికారులు విధులను తూచా తప్పకుండా నిర్వహించాలి
-జిల్లా కలెక్టర్ . గుగులోత్ రవి
2020 సెన్సెస్ సర్వేలో అధికారులు విధులను తూచా తప్పకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి.రవి సూచించారు. జిల్లాలో 2021 సెన్సెస్  పై గురువారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏల్లో జరుగుచున్న శిక్షణా శిబిరానికి జిల్లా కలెక్టర్ జి. రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2021 సన్ సెక్స్ లెక్కల గురించి చార్జి అధికారులు, అదనపు చార్జర్ అధికారులు, సూపర్వైజర్ల శిక్షణలో పాల్గొని ఏ విధంగా చేయాలన్న విషయాలను వివరించారు. మండలాలలో తాహసీల్దార్ లు, ఎంపీడీవోలు, నాయబ్  తహసీల్దార్లు ఉంటారని మరియు పట్టణాలలో మున్సిపల్ కమిషనర్ లో చూస్తారని అన్నారు. సెన్సెస్ సర్వేలో ఒక్కొక్కరికి 150 నుండి 180 వరకు గృహాలు ఉంటాయని అన్నారు. ప్రతి గ్రామంలో , ప్రతి పట్టణంలో ఏ వీధిని కూడా విడిచిపెట్టకుండా లెక్కలు సరిగా చేయాలని ఒకవేళ సరిగా చేయనట్లయితే మళ్లీ 10 సంవత్సరాల వరకూ అదే విధంగా ఉంటుందని, అందుచే తప్పకుండా విధిగా మీకు కేటాయించిన విధులను తూచా  తప్పకుండా నిర్వహించాలని అన్నారు. ఈ   సెన్సెస్ పాల్గొని ఉద్యోగులు వివరాలను మరొక సారి సరి చూడాలని ఎందుకంటే ఎవరైనా పదవీ విరమణకు లేదా మరేదయినా కారణం చేత లేని వారు పేరు ఉండకూడదనే మరొకసారి జాబితాను సరిచేసుకొని వారికి డ్యూటీ వేయాలనే సంబంధిత అధికారులను కోరారు. ఫీల్డ్ లో ఎలాంటి సమస్యలు రాకుండా ఏ విషయమైనా తెలియనట్లు అయితే ఈ ట్రైనింగులో పూర్తిగా మీకు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు. అనంతరం పల్లె ప్రగతి పై మాట్లాడుతూ మొదటి, రెండవ విడత పల్లె ప్రగతిలలో ప్రతి గ్రామంలో సొంత పని లాగా భావించి ప్రతి గ్రామంలో మొక్కలను నాటి నా రాణి, ప్రతి గ్రామంలో వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డ్, సోప్ కిడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కానీ వాటిని ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు ఎంపీడీవోలు ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పోస్టులు ఖాళీ లేకుండా అన్ని భర్తీ చేయడం కూడా జరిగిందని అందుచే గ్రామాలలో పల్లె ప్రగతి చేపట్టిన పనులన్నీ జరిగే విధంగా చూడవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉన్నది అన్నారు.  నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత, శానిటేషన్ నిరంతరము చేసే పనులు అని అన్నారు. జిల్లాలో పాత బోర్ వెళ్ళు, పనికిరాని బావులు పూడ్చాలని ఒకవేళ పూర్తి చేసినట్లయితే ఏమీ లేవని గ్రామాల నుండి సర్టిఫికెట్ పొందాలని డిపీఓ  ను కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ వో శ్రీమతి అరుణ శ్రీ, జడ్పీ సీఈవో ఏ శ్రీనివాస్, ఆర్ డి ఓ నరేందర్, డిప్యూటీ సీఈఓ శ్రీమతి శ్రీలత రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తాహసిల్దార్ లో, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts