YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

టాస్క్ ఫోర్స్ పోలీసు లపై రాళ్లతో దాడి చేసిన  ఎర్ర స్మగ్లర్లు 

టాస్క్ ఫోర్స్ పోలీసు లపై రాళ్లతో దాడి చేసిన  ఎర్ర స్మగ్లర్లు 

టాస్క్ ఫోర్స్ పోలీసు లపై రాళ్లతో దాడి చేసిన  ఎర్ర స్మగ్లర్లు -ఇద్దరు స్థానికులతో సహా 13 ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్టు : 52 దుంగలు స్వాధీనం
-తిరుపతి-తిరుమల నడిచే టెంపో ట్రావెలర్ లో ఎర్ర చందనం రవాణా -రెండు వాహనాలు స్వాధీనం
చిత్తూరు, ఫిబ్రవరి 14, 
ఎర్ర చందనం స్మగ్లర్లు మరో సారి తెగబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసు లపై రాళ్లతో దాడి కి దిగి కారు అద్దాలు పగలగొట్టారు. దాదాపు 60 మంది స్మగ్లర్లు శేషాచలం అడవుల నుంచి ఎర్ర చందనం దుంగలను మోసుకుని వస్తుండగా టాస్క్ ఫోర్స్ చుట్టు ముట్టి 13 మంది స్మగ్లర్లు ను అరెస్టు చేశారు. మిగిలిన వారు అడవులలో తప్పించుకోగా వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది. తిరుపతి, తిరుమల మధ్య నడిచే చిత్తూరు జిల్లాకు చెందిన టెంపో ట్రావెలర్ వాహనం లో ఎర్ర దుంగలను రవాణా చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ శ్రీ పి రవిశంకర్ గారికి అందిన సమాచారం మేరకు ఆర్ ఐ చెందు ఆధీనంలోని  ఆర్ ఎస్ ఐ లు వాసు, విజయ్, జానీ భాషాల బృందం గురువారం రాత్రి నుంచి శేషాచలం అడవులలో కూంబింగ్ చేపట్టాయి. అలిపిరి నుంచి ఒక బృందం, శ్రీవారి మెట్టు నుంచి మరో టీమ్ కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం మూడు గంటల ప్రాంతం లో శ్రీనివాస మంగాపురం ఆలయం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఒక టెంపో ట్రావెలర్, ఒక మహింద్ర స్కైలొ వాహనాలు కనిపించాయి. అక్కడ దాదాపు 60 మంది స్మగ్లర్లు ఎర్ర చందనం దుంగలను వాహనాలలో చేరవేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చుట్టు ముట్టారు. దీంతో స్మగ్లర్లు పోలీసులను చూసి తమిళం లో అరుస్తూ, రాళ్లతో దాడి చేశారు.  టాస్క్ ఫోర్స్ పోలీసులు సాహసోపేతంగా వ్యవహరించారు. పోలీసులు వద్ద తుపాకులు కూడా ఉండటం తో, వాటిని చూసిన స్మగ్లర్లు దుంగలు పడవేసి పారిపోయారు. చాకచక్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు13 మందిని  పట్టుకో గలిగారు. వారిలో ఇద్దరు స్థానికులు ఉన్నారు. తిరుపతి సత్యనారాయణ పురం కు చెందిన గుంట గోలు వేణు, పేరూరు గ్రామానికి చెందిన చెవిరెడ్డి నేతాజీ ఉన్నారు. ఇంకా తమిళనాడు  తిరువన్నామలై, వేలూరు జిల్లా లకు చెందిన అన్నమలై, సామి బుచ్చు, మణి, ప్రకాష్,వెల్లయ్యన్ రవి, సామికన్ను, జయపాల్, విజయ్ కుమార్,జయరామన్, కార్తిక్, సత్యవేల్ ఉన్నారు.  సంఘటన స్థలానికి సిఐ సుబ్రమణ్యం, ఆర్ ఐ చెందు, ఎఫ్ ఆర్ ఒ ప్రసాద్ చేరుకున్నారు. భారీ స్థాయిలో స్మగ్లర్లు ను ప్రాణాలకు తెగించి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ బృందాలను ఇంచార్జి పి రవిశంకర్ అభినందించారు. ఈ ఆపరేషన్ లో డీఅర్వో నరసింహారావు,వెంకటేష్, ప్రతాప్,నాగేంద్ర, గిరి, రమేష్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ సిఐ సుబ్రమణ్యం, కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts