
కాకినాడలో చంద్రబాబు
కాకానిడ ఫిబ్రవరి 14
కాకినాడలో జరిగిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ వర్మ తనయుడు గిరీ్‌షవర్మ, మనీషాల వివాహా వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే టీడీపీ శాసనసభా పక్ష నేతలు కింజెరపు అచ్చెంనాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలంతా విందు ఆరగించారు. అనంతరం చంద్రబాబు రహదారి మీదుగా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి బయల్దేరారు. వధూవరులను ఆశీర్వదించిన వారిలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీలు వీవీ అబ్బు, చిక్కాల రామచంద్రరావు, టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర్రావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, జ్యోతుల నెహ్రూ, దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు, జ్యోతుల నవీన్‌కుమార్ తదితరులన్నారు.