YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నకిలీ పోలీసు ఆరెస్టు

నకిలీ పోలీసు ఆరెస్టు

నకిలీ పోలీసు ఆరెస్టు
ఒంగోలు ఫిబ్రవరి 14
అతనికి పట్టుమని పాతికేళ్లు కూడా లేవు.. చదువుకున్నది పదో తరగతే.. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో కరాటే మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. చిన్నప్పట్నుంచి పోలీసు శాఖలో ఎస్సై కావాలనేది అతని కోరిక. కానీ అందుకు తగ్గ చదువు లేదు. అంతే నకిలీ పోలీసు అవతారమెత్తాడు. ఓ బుల్లెట్‌ కొనుగోలు చేసి దానిపై పోలీసు అని స్టిక్కర్‌ వేయించుకున్నాడు. అంతటితో ఆగలేదు. ఆ వాహనంపై నగరంలో చక్కర్లు కొట్టేవాడు. నగర శివారు ప్రాంతాల్లో సంచరించేవాడు. ఒంటరిగా ఉన్న వ్యక్తులను గుర్తించేవాడు. తాను ఎస్సైననీ, మీరెందుకు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారని బెదిరించేవాడు.చివరికి పోలీసులకు చిక్కాడు ఒంగోలు నెహ్రూనగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతానికి చెందిన వంశీ పదో తరగతి పూర్తిచేశాడు. ఆ తర్వాత కరాటేలో శిక్షణ పొంది ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేస్తున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి పోలీస్‌ ఎస్సై కావాలనేది కోరిక. విద్యార్హతలు లేకపోవడంతో నకిలీ ఎస్సై అవతారం ఎత్తాడు. బుల్లెట్‌పై పోలీస్‌ అనే ఆంగ్ల అక్షరాలను స్టిక్కరింగ్‌ చేేయించుకుని నగర శివారు ప్రాంతాల్లో సంచరిస్తూ పలువురిని బెదిరింపులకు గురి చేశాడు. సుమారు ఏడాదికాలంగా ఈ తరహా నేరాలకు అతను పాల్పడుతున్నాడు. ఇతను నిజమైన పోలీసు అని నమ్మిన బాధితులు ఎవరూ అతని గురించి ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలో ఈ నెల 7న దశరాజుపల్లి అడ్డరోడ్డు వద్ద గస్తీ విధుల్లో ఉన్న బ్లూకోట్స్‌ పోలీసులను ఇదే తరహాలో బెదిరించాడు. తాను డీజీపీ కార్యాలయంలో పనిచేసే ప్రత్యేక విభాగం ఎస్సైనని చెప్పి వారిని బెదిరింపులకు గురి చేశాడు. ఈ ఉదంతంపై కానిస్టేబుల్‌ వి.శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు తాలూకా ఎస్సై యు.సాంబశివయ్య కేసు నమోదు చేశారు. ఎస్సైనని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడి గురించి ఆరా తీశారు. అతను నెహ్రూనగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతానికి చెందిన వంశీగా గుర్తించారు. నిందితుడిని ఒంగోలు కిమ్స్‌ హాస్పిటల్‌ వెళ్లే రోడ్డులో అరెస్టు చేశారు. అతడి నుంచి నేరాలకు వినియోగిస్తున్న బుల్లెట్‌ వాహనంతో పాటు అర కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts