YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వేలెంటైన్స్ డే సందర్భంగా `14`మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుద‌ల‌.

వేలెంటైన్స్ డే సందర్భంగా `14`మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుద‌ల‌.

వేలెంటైన్స్ డే సందర్భంగా `14`మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుద‌ల‌.
రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న‌ చిత్రం `14`. లక్ష్మిశ్రీనివాస్ ద‌ర్శకత్వంలో సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిద్యభరితమైన ఈ చిత్రంలో రతన్, విశాఖ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని బిగ్ బాస్ విన్నర్ `రాహుల్ సిప్లిగంజ్` విడుదల చేశారు. ఈ సందర్భంగా.రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ... “ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్ లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అనుకుంటున్నాను. నోయల్ కి `కుమారి 21ఎఫ్` సినిమాకన్నా ఎక్కువ పేరు రావాలని ఆశిస్తున్నాను. టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్‌`` అన్నారు.దర్శకుడు లక్ష్మిశ్రీనివాస్ మాట్లాడుతూ -  “కొత్త పాయింట్ ని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం. త‌ప్ప‌కుండా  మా చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.నోయెల్ సీన్, రతన్, వైశాఖ, పోసాని ష్ణమురళి, శ్రీకాంత్ ఆచార్య, మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయినాథ్, సంగీతం: ఎర్త్ సౌండ్స్, ఎడిటర్: జానకిరామ, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, మాటలు: ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కామిరెడ్డి బాబురెడ్డి, నిర్మాతలు: సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల, రచన- దర్శకత్వం : లక్ష్మిశ్రీనివాస్.

Related Posts