YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజధాని పేరుతో రియల్ దందా

రాజధాని పేరుతో రియల్ దందా

 

రాజధాని పేరుతో రియల్ దందా
విశాఖపట్నం  ఫిబ్రవరి 14
\మీడియా సమావేశంలో చంద్రబాబు,లోకేశ్ బినామీలపై ఐటీ సోదాలు జరిగాయి.  విజయవాడ,హైదరాబాద్ సహా ఢిల్లీ, పుణెలలో కూడా సోదాలు జరిగాయి.  మొత్తం 40కిపైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ అక్రమ లావాదేవీలు చేసినట్లు గుర్తించారు.  చంద్రబాబు పెద్ద  అవినీతిపరుడని మేం మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాం.  రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.  గత 5 ఏళ్ళలో కాంట్రాక్టుల పేరుతో రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. - చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారనే మేం రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని అన్నారు.  ఆఖరికి పేదలకు నిర్మించే ఇళ్ల  నిర్మాణంలో కూడా చంద్రబాబు అవినీతి చేశారు.   ఇళ్ళ నిర్మాణంలో రూ.3,239 కోట్ల పనుల్లో .. మా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్తే రూ.392 కోట్లు ఆదా చేశాం.  చంద్రబాబు ఏ విధంగా ప్రజాధనాన్ని దోచుకున్నారో అర్థమవుతుంది.  పోలవరంపై రివర్స్ టెండరింగ్ వెళ్తే రూ.800కోట్లు ఆదా చేశాం.   ఏ విధంగా దోచుకోవచ్చో చంద్రబాబు ప్రభుత్వంలో  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు  కుటుంబరావు ప్రణాళికలు వేశారు.  తన పీఎస్ అక్రమ లావాదేవీలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు.  చంద్రబాబు తోకపత్రికలు ఎందుకు వార్తలు రాయడం లేదు. - వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు దిట్టని అయన అన్నారు.  ఈసారి మేనేజ్ చేయడం కుదరలేదేమో...మిస్ ఫైర్ అయ్యింది.  చంద్రబాబు హయాంలో రూ.1 లక్షా 95వేల కోట్లు అప్పు చేస్తే...ఎక్కడెక్కడ ఖర్చు చేశారో చెప్పలేదు.  ఎన్నికల ముందే రూ.46 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. ప్రతిదీ దోపిడీనే.   అప్పులు తీసుకొచ్చి మరీ చంద్రబాబు దోచుకున్నారు. పంచ భూతాలను దోచుకున్నారు.   ప్రధాని ,సీఎం భేటీపై కూడా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.  ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే సీఎం శ్రీ జగన్ ప్రయత్నం చేస్తున్నారు.  చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులు.  అక్రమ లావాదేవీలపై చంద్రబాబు నోరు విప్పాలి.  చంద్రబాబు,టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తినేశారు.  చంద్రబాబు, ఆయన బినామీల పై వస్తున్న ఆరోపణలు, వేల కోట్ల రూపాయల కుంభకోణాలపై సమగ్రంగా విచారణ జరపాలి. చంద్రబాబే తనకు తానుగా విచారణ కోరాలి.   రూ. 2 వేల కోట్ల అక్రమాలు బయటకు రావడంతో తండ్రీ కొడుకులిద్దరూ హడావుడిగా హైదరాబాద్ వెళ్ళారట. ఇప్పటికైనా చంద్రబాబు నోరు విప్పాలి. ఐటీ దాడులకు టీడీపీకి  సంబంధం ఏమిటి అని మాట్లాడుతున్న వాళ్ళకు కూడా బాగా తెలుసు. ఈ కంపెనీలు.. పట్టుబడ్డ వారంతా ఎవరి బినామీలు.. అవి ఎవరి కంపెనీలు.. శ్రీనివాస్ ఎవరు.. ఈ అంశాలన్నీ తెలుసు.  అయినా పైకి బుకాయిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిగితే చంద్రబాబు ఎక్కడ ఉంటారో అని అయన అన్నారు. 

Related Posts

0 comments on "రాజధాని పేరుతో రియల్ దందా"

Leave A Comment