YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరులో కంటి వెలుగు కార్యక్రమం

చిత్తూరులో కంటి వెలుగు కార్యక్రమం

చిత్తూరు, ఫిబ్రవరి 18,  డా.వై.ఎస్.ఆర్ కంటివెలుగు-మూడవ విడత కార్యక్రమాన్ని 60 సంవత్సరాలు పై బడిన అవ్వాతాతలందరూ సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సత్యనారాయణ పురం లోని  ఆరోగ్యకేంద్రం లో అయన   డా. వై.ఎస్.ఆర్ కంటివెలుగు-మూడవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులకు జిల్లా అందత్వ  నివారణాధికారి డా.రాజశేఖర్ రెడ్డి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆప్థాలమిక్ వైద్యులు వీరారెడ్డి 60 సంవత్సరాలు పై బడిన అవ్వ తాతలందరికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి హాజరైన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ నేడు చిత్తూరు పట్టణంలో డా.వై.ఎస్.ఆర్ కంటి వెలుగు మూడవ విడత కార్యక్రమాన్ని ప్రారంబించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఉపయోగపడే విధంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నదని ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డా.వై.ఎస్.ఆర్ కంటివెలుగు-మూడవ విడత కార్యక్రమంలో భాగంగా 60 సంవత్సరాలు పై బడిన అవ్వా తాతలందరికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి దాదాపు 9 వేల మందికి కంటి అద్దాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వై.ఎస్.ఆర్.ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైన లబ్దిదారులు వెయ్యి రూపాయలకు పైన ఎంత ఖర్చు చేసిన ఈ ఖర్చును ప్రభుత్వమే బరిస్తుందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి , రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్త లు పేదలకు  సహాయం చేయడానికి సిద్ధం గా ఉన్నారని తెలిపారు. నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ  పథకాల ద్వారా ఎంతో మంది ప్రజలకు లబ్ది చేకూరుస్తూ ఉందన్నారు.

Related Posts