YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 కాలుష్యంతో తిరుమల విలవిల

 కాలుష్యంతో తిరుమల విలవిల

 కాలుష్యంతో తిరుమల విలవిల
తిరుమల, ఫిబ్రవరి 19
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల గిరులను కాలుష్యం వెంటాడుతుంది. ప్రముఖ పట్టణాల, పారిశ్రామిక వాడల్లో వెలువడే స్ధాయిలో కాలుష్యం తిరుమలలో నమోదు కావడం ఇప్పుడు అధికారులను కలవరపెడుతొంది. ప్రధానంగా వాహన కాలుష్యం పరిధులు దాటుతుండడంతో, కాలుష్య నియంత్రణ దిశగా టీ.టీ.డీ అడుగులు వేయాల్చిన అవసరం ఉంది. లేదంటే భావితరాలకు తిరుమల అథ్యాత్మిక, ప్రకృతి అందాలను అందించలేమని పరిస్థితి కనిపిస్థున్నది. కాలుష్యం మరింత కోరలు చాచకముందే టీటీడీ దేవస్థానం అదికారులు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పచ్చదనం, ప్రకృతి శోభ, ఆహ్లాదకరమైన వాతవరణంతో ఉండే తిరుమల గిరులు ఇప్పుడు ప్రమాద ఘంటిలకు చేరువలో ఉన్నాయనే చెప్పవచ్చు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి తరలి వస్తుంటారు. వీరిలో అధికశాతం మంది వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటుంటారు. ఇలా రోజుకు సుమారు పది వేల వాహనాల దాకా రాకపోకలు తిరుపతి నుంచి తిరుమలకి, తిరుమల నుంచి తిరుపతి మద్యన సాగుతుంటాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో కెల్లా ఇంధన వ్యయం, అందుకు తగ్గ రాబడి తెచ్చి పెడుతూ రాష్ట్రంలో ద్వితియ స్ధానంలో తిరుమల-తిరుపతి ఆర్టీసీ విభాగం ఉంది. అదే స్థాయిలో తిరుమల కాలుష్య ప్రమాదంలో పడటానికి ఆర్టీసీ బస్సులు కూడా ఒక రకంగా దోహద పడుతున్నాయి. వాహనాల కారణంగా తిరుమలకి ఎంత మేరకు కాలుష్యం వల్ల కలిగే ప్రమాదం పొంచి ఉందో కూడా ఆర్ధం చేసుకోవచ్చు. వేలాది మంది భక్తులను తిరుమలకు తీసుకెళ్ళి మళ్ళీ తిరుపతికి తరలిస్తుంటాయి ఆర్టీసీ బస్సులు. ఘాట్ రోడ్లలో ఆర్టీసీ ప్రయాణం నిజంగా సురక్షితం. అందుకే భక్తులు సైతం బస్సుల్లోనే ప్రయాణానికి మెగ్గు చూపుతారు. ఇవేకాక రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాంతాలతో పాటు ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా తిరుమలకి అధికంగా ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. దీంతో పాటు తిరుమల-తిరుపతిలోని వివిధ వాహనాలతో కూడిన సొంత వాహనాలు, ప్రైవేటు ట్రావెల్స్ వారి సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యంతో కొండకు ముప్పు వాటిల్లుతొంది. నిత్యం ఘాట్ రోడ్డు మార్గాల గుండా ప్ర యాణించే వాహనాలలో అధికశాతం కాలం చెల్లిన వాహనాలు నడుస్తున్నాయి. సాధారణ రోడ్లలో వీటి నుంచి వెలువడే కాలుష్యం అంతగా తెలియక పోయినా, ఘాట్ రోడ్లలలో మాత్రం వీటి నుంచి వెలువడే కాలుష్యం అధికస్ధాయిలో ఉంటుంది. చుట్టు ప్రక్కల వాతావరణాన్ని కాలుష్య మయం చేస్తున్నా టీటీడీకి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీని వల్ల శేషాచలం అటవీ ప్రాంతాల్లో వెలసిన ఎన్నో జీవరాసులు ఇప్పటికే కాలుష్యపు కోరల్లో చిక్కుకుని చనిపోతున్న పరిస్థితి నెలకొంది.  ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి టీటీడీని సంప్రదించింది. కొండపై వాతవరణ పరిస్దితులు, కాలుష్యం తదితరాలపై ఆంచనా వేసేందుకు తొలివిడతగా కోటిన్నర రూపాయలతో ఓ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసింది. అయితే పూర్తిస్దాయిలో ఇంకా ప్రారంభంకాని కాలుష్య ఆధ్యయనంలో ఊహించని విధంగా రిపోర్టు నమోదు కావడంతో నిపుణులను సైతం ఆందోళనలో పడేస్తున్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని కాలుష్య రహిత తిరుమలగా తీర్చాలని పోలీసులు అంటున్నారు.టీటీడీ అధికారులు కూడా తిరుమలలో వెలువడుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
========================================
03 ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పదవి యోగం
గుంటూరు, ఫిబ్రవరి 19, (న్యూస్ పల్స్)
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. పార్టీలో తొలి నుంచి నమ్ముకున్న పెద్దాయన. ఒకరకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి అప్పట్లో మైసూరారెడ్డి వంటి సీనియర్ నేతలు వచ్చారు. అయితే టీడీపీ నుంచి వచ్చిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైసీపీనే నమ్ముకుని ఉన్నారు. దీంతో జగన్ కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మండలిలో పార్టీ నేత పదవి కూడా జగన్ ఇచ్చారు.ఇక ఎన్నికల సమయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును మ్యానిఫేస్టో కమిటీ ఛైర్మన్ గా నియమించి జగన్ ఆయనకు పెద్ద బాధ్యతలను అప్పగించారు. మ్యానిఫేస్టోను సింపుల్ గా అన్ని అంశాలూ కవర్ అయ్యేలా చూడటంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కీలక భూమిక పోషించి జగన్ నుంచి శభాష్ అనిపించుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇలా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పార్టీలో తగిన గౌరవమే లభిస్తుంది.అయితే ఇప్పుడు శాసనమండలి రద్దు అవుతుండటంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఉన్న పదవి పోతుంది. వయసు రీత్యా ఆయన పార్టీ పదవులను చేపట్టలేని పరిస్థితి. ఈ సంగతి జగన్ కు తెలియంది కాదు. అందుకే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పెద్దల సభకు పంపాలని జగన్ డిసైడ్ అయ్యారట. త్వరలోనే ఏపీకి సంబంధించి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఆ నాలుగు స్థానాలూ సంఖ్యాబలం ప్రకారం వైసీపీకే దక్కుతాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే రాజ్యసభకు ఎన్నికలు జరుగుతాయి.ఈ ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేేసే నలుగురిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. పెద్దాయనను పెద్దల సభకు పంపించి గౌరవించుకోవాలని కూడా జగన్ డిసైడ్ అవ్వడంతో ఒక నాలుగింటిలో ఒకటి ఉమ్మారెడ్డికి ఇప్పటికే జగన్ రిజర్వ్ చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద పార్టీని తొలి నుంచి నమ్ముకుని ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు గౌరవప్రదమైన స్థానం లభించబోతోంది.

Related Posts