YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

 ప్రీ ఓన్డ్ కార్ల బిజినెస్ లోకి పెద్ద కంపెనీలు

 ప్రీ ఓన్డ్ కార్ల బిజినెస్ లోకి పెద్ద కంపెనీలు

 ప్రీ ఓన్డ్ కార్ల బిజినెస్ లోకి పెద్ద కంపెనీలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 19,
లగ్జరీ స్పోర్ట్స్ కారు తయారీదారు పోర్షో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది.కస్టమర్ బేస్‌‌ను మరింత పెంచుకునేందుకు కంపెనీ ఈ ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల నుంచి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్(ఎస్‌‌యూవీల) వరకు విక్రయిస్తోంది. ఈ కంపెనీ కార్ల ధరలు రూ.69.98 లక్షల నుంచి రూ.1.63 కోట్ల వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో పోర్షోకు 3,500 మంది కస్టమర్లు ఉన్నారు. ‘ప్రీ ఓన్డ్ కారు బిజినెస్‌‌లను మేము సీరియస్‌‌గా పరిశీలిస్తున్నాం. మా కారు పార్క్‌‌ 3,500 కార్లకు మించి ఉండాలి. యూజ్డ్ కారు బిజినెస్‌‌ల కోసం మేము సరియైన ఫార్మాట్‌‌ను వెతుకుతున్నాం’ అని పోర్షో ఇండియా డైరెక్టర్ పవన్ శెట్టి అన్నారు. గ్లోబల్‌‌గా ఈ కంపెనీ ఇప్పటికే ప్రీ ఓన్డ్ కార్లను అమ్ముతోంది. పోర్షో అప్రూవ్డ్ బ్రాండ్ కింద వీటిని విక్రయిస్తోంది. యూజ్డ్ కారు వ్యాపారాలు బాగుంటాయని తాము కాన్ఫిడెన్స్‌‌తో ఉన్నట్టు చెప్పారు. తొమ్మిదేళ్ల వారెంటీ ఇస్తోన్న కొన్ని బ్రాండ్లలో తాము ఒకరమని గుర్తు చేశారు. ఈ తొమ్మిదేళ్ల వారెంటీ అనేది కారు క్వాలిటీని చూపిస్తోందని పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లను ఇక్కడ విక్రయించడంపై మాట్లాడిన పవన్, క్వాలిటీనే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారని చెప్పారు.   కారు బ్రేక్‌‌ డౌన్ అవ్వకూడదని కోరుకుంటున్నారని తెలిపారు. 2020లో అమ్మకాలపై స్పందించిన ఆయన, ఈ సమయంలో నెంబర్లు చెప్పడం కష్టమేనని అన్నారు. కానీ 2019లో సాధించిన నెంబర్లను మళ్లీ చేరుకోవడంపై దృష్టిసారిస్తున్నామన్నారు. ‘2018లో 348 కార్లను అమ్మాం. గతేడాది ఆటో ఇండస్ట్రీకి కాస్త సవాలుగానే ఉంది. అయినా 350 కార్లను విక్రయించాం. ఈ ఇయర్ కూడా ఇదే మాదిరి విక్రయాలు జరుపాలని ఆశిస్తున్నాం. 2019కు తగ్గట్టే 2020 కూడా ఉంటుందనుకుంటున్నాం’ అని పవన్ శెట్టి అన్నారు. పోర్షో స్పోర్ట్స్ కారు పనామెరా 10వ ఇయర్ ఎడిషన్‌‌ను ఈ ఏడాది రెండో క్వార్టర్‌‌‌‌లో లాంచ్ చేయాలనుకుంటోంది. అదేవిధంగా ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ కారు టేకాన్‌‌ను తీసుకొచ్చేందుకు చూస్తోంది.2023 నాటికి యూజ్డ్ కారు మార్కెట్ 25 బిలియన్ డాలర్లకు(రూ.1.78 లక్షల కోట్లకు) చేరుకోనుందని ఇప్పటికే పలు రిపోర్ట్‌‌లు అంచనావేశాయి. మిలీనియల్స్ కూడా ఎక్కువగా యూజ్డ్ కార్లను కొనేందుకే మొగ్గు చూపుతున్నట్టు పేర్కొన్నాయి. కొత్త కారు మార్కెట్ కంటే ప్రీ ఓన్డ్ కారు మార్కెట్ 1.3 టైమ్స్ పెద్దదిగా ఉండబోతుందని తెలిపాయి. ప్రస్తుతం యూజ్డ్ కారు మార్కెట్ 14 బిలియన్ డాలర్లుగా ఉంది. మిలీనియల్స్ అంటే 22 నుంచి 37 ఏళ్ల మధ్యనున్న వారు. వీరు ఎక్కువగా కారులోని టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతో పాటు, రీసేల్ వాల్యును చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌‌ ప్రోత్సాహంతో వీరు యూజ్డ్ కార్ల వైపుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతేకాక, గత ఏడాది కాలంలో యూజ్డ్ కార్లను కొన్న మిలీనియల్స్‌‌లో సగం మంది తొలిసారి కారు నడుపుతున్న వారే కావడం విశేషం. మిగిలిన సగం మంది ఇప్పటికే కారు ఉన్న వారు. మిలీనియల్స్ ఎక్కువగా యూజ్డ్ కార్ల వైపుకి చూస్తుండటంతో, పెద్ద పెద్ద కార్ల కంపెనీలు కూడా ఈ వ్యాపారంపై ఫోకస్ పెట్టాయి.  అంతేకాక, ప్రీ ఓన్డ్ సెగ్మెంట్ పెరుగుతుండటంతో, లగ్జరీ కార్ల మార్కెట్ కూడా పెరుగుతోంది. ఇప్పటి  వరకు లగ్జరీ కార్లు కొనడం చాలా మందికి డ్రీమ్‌‌గానే మిగిలేది. కానీ ఇప్పుడు కస్టమర్లు తేలికగా ప్రీ ఓన్డ్ లగ్జరీ కార్లను కొంటున్నారని తాజా రిపోర్ట్‌‌లు చెప్పాయి. ఈ మార్కెట్‌‌లో లగ్జరీ కారు ధరలు భారీగా తగ్గుతున్నాయి. కన్జూమర్ల ఛాయిస్ మేరకు ఇవి రూ.15 లక్షల నుంచి దొరుకుతున్నాయి. ఆటోమొబైల్ డీలర్స్ సమాచారం మేరకు ప్రీ ఓన్డ్ లగ్జరీ కార్లు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌‌లో 35%  నుంచి 40% వరకు పెరుగుతున్నాయని అంచనా. లగ్జరీ కార్ల ఓనర్లు ఏడాది లేదా రెండేళ్ల తర్వాత తమ కార్లను అమ్మి కొత్త వాటికి అప్‌‌గ్రేడ్ అవుతున్నారు.

Related Posts