YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ దేశీయం

 అయిల్ ఫామ్ సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

 అయిల్ ఫామ్ సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

 అయిల్ ఫామ్ సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ ఫిబ్రవరి 24
తెలంగాణ ముందుచూపుకు కేంద్రం సానుకూలం.  ఆయిల్ పామ్ సాగు అనుమతి కోసం పెట్టిన ఫైలుకు మోక్షం లభించింది.  రాబోయే రెండేళ్లలో 18.100 హెక్టార్లలో (45,250 ఎకరాలు) ఆయిల్ పామ్ సాగుకు అనుమతిస్తూ లేఖను కేంద్రం పంపింది.  2019 - 20 సంవత్సరానికి గాను 2500 ఎకరాలలో తెలంగాణ ఉద్యానశాఖ ప్రయోగాత్మకంగా ఆయిల్ పామ్ సాగును ప్రారంభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. *ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతుల నేపథ్యంలో అయన మీడియతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ  ఏటా 40 వేల కోట్ల రూపాయల పామాయిల్ ను మన దేశం దిగుమతి చేసుకుంటున్నది.  రూ.75 వేల కోట్ల విలువైన 21 మిలియన్ టన్నుల నూనెలను మనం దేశం దిగుమతి చేసుకుంటున్నది.  15 మిలియన్ టన్నుల ఆయిల్ పామ్ ను దిగుమతి చేసుకుంటున్నాం.  తెలంగాణలో 246 మండలాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం అని  కేంద్రం సర్వే తేల్చింది.  విదేశీ మారకద్రవ్యం ఆదా చేసేందుకు ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం  ప్రోత్సహిస్తుంది.  అధిక ఆదాయంతో పాటు రైతులను పంటమార్పిడి వైపు ప్రోత్సహించినట్లు అవుతుందని ముందుచూపుతో అడుగులు వేస్తున్నాం.  సాంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టాల పాలవుతున్నారు. - ఇప్పటికే ఆయిల్ పామ్ సాగువైపు  మళ్లించేందుకు రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలు అయిల్ ఫెడ్  చేపట్టింది.  నాలుగేళ్ల నుండి దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే ఆయిల్ పామ్,   అంతర పంటల సాగుకు అనుకూలమని అయన అన్నారు.  దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ పంటకు విపరీతమయిన డిమాండ్ వుంది.  కేంద్రం అనుమతి నేపథ్యంలో పంటమార్పిడి వైపుకు రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అయన అన్నారు. 

Related Posts