YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారత జోడీల ముందంజ

భారత జోడీల ముందంజ

ప్రీక్వార్టర్స్‌లో జెలెనాకు ఝలక్‌

వరుసగా రెండో రోజూ సూర్యుడు నిప్పులుగక్కాడు. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకుపైగా చేరడంతో ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో తలపడుతున్న ఆటగాళ్లు ఆపసోపాలు పడుతున్నారు. మరోవైపు సీడెడ్‌ ప్లేయర్లకు షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. శుక్రవారం మహిళల విభాగంలో మరో స్టార్‌ క్రీడాకారిణి కంగుతిన్నది. ఏడోసీడ్‌ జెలెనా వోస్తపెంకోకు మూడో రౌండ్‌లో చుక్కెదురైంది. పురుషుల్లో 15వ సీడ్‌ సోంగా పరాజయం పాలయ్యాడు. టాప్‌సీడ్‌ రఫెల్‌ నడాల్‌ మరో సునాయాస విజయంతో ప్రీక్వార్టర్స్‌కు దూసుకుపోగా.. మూడోసీడ్‌ దిమిత్రోవ్‌, ఆరోసీడ్‌ సిలిచ్‌, పదోసీడ్‌ బుస్టా కూడా ముందంజ వేశారు. మహిళల్లో రెండోసీడ్‌ వోజ్నియాకి, నాలుగోసీడ్‌ స్విటోలినా ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

ప్రీక్వార్టర్స్‌లో భారత ఆటగాళ్లు: రోహన్‌ బోపన్న-రోజర్‌ వాసిలిన్‌, దివిజ్‌ శరణ్‌-రాజీవ్‌ రామ్‌ల జోడీలు పురుషుల డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించాయి. రెండోరౌండ్‌లో బోపన్న ద్వయం 6-2, 7-6 (3)తో సౌసా-మేయర్‌ జోడీపై నెగ్గింది. శరణ్‌-రాజీవ్‌ 4-6, 7-6 (4), 6-2తో గ్రానొలెర్స్‌-ఫాగ్నినిపై గెలుపొందింది.

పాపం.. వోస్తపెంకో: ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ జెలెనా వోస్తపెంకో(లాత్వియా)కు మూడోరౌండ్‌లోనే ఓట మి ఎదురైంది. ఇస్తోనియాకు చెందిన 32వ సీడ్‌ అనెట్‌ కొంటావిట్‌ 6-3, 1-6, 6-3తో ఆమెను కంగుతినిపించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. 22 ఏళ్ల కొంటావిట్‌ ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ రౌండ్‌ 16కు చేరుకోవడం ఇదే తొలిసారి.

కోస్ట్యుక్‌కు స్విటోలినా చెక్‌ : 1996లో మార్టినా హింగిస్‌ తర్వాత మెల్‌బోర్న్‌ పార్క్‌లో మూడోరౌండ్‌కు చేరుకున్న పిన్నవయసు క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పిన 15 ఏళ్ల మార్టా కోస్ట్యుక్‌ (ఉక్రెయిన్‌)కు సహచరి స్విటోలినా చెక్‌ చెప్పింది. నాలుగోసీడ్‌ స్విటోలినా 6-2, 6-2తో కోస్ట్యుక్‌ని చిత్తుచేసి టైటిల్‌ దిశగా మరో అడుగు వేసింది. మరో మ్యాచ్‌లో రెండోసీడ్‌ వోజ్నియాకి (డెన్మార్క్‌) 6-4, 6-3 తో బెర్ట్‌న్స్‌ (రుమేనియా)పై నెగ్గిం ది. అలాగే 19వ సీడ్‌ రిబరికోవా, సువారెజ్‌, అలెర్టోవా, మెర్టెన్స్‌, మార్టిక్‌ కూడా ప్రీక్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నారు.

‘రఫా’డించాడు: వరల్డ్‌ నెంబర్‌ వన్‌ నడాల్‌ టైటిల్‌ దిశగా ముందంజ వేశాడు. మూడోరౌండ్‌ ప్రత్యర్థి డమీర్‌ జుమూర్‌ను అతను ‘రఫా’డించాడు. గంటా 50 నిమిషాల మ్యాచ్‌లో స్పెయిన్‌ బుల్‌ 6-1, 6-3, 6-1తో జుముర్‌ను చిత్తు చేశాడు. నడాల్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్లో 24వ సీడ్‌ డీగొ ష్వార్ట్‌జ్‌మన్‌(అర్జెంటీనా)తో తలపడతాడు. ష్వార్ట్‌జ్‌మన్‌ 6-7 (1), 6-2, 6-3, 6-3తో డొల్గొపొలోవ్‌ (ఉక్రెయిన్‌)పై మూడోరౌండ్‌లో గెలుపొందాడు.

దిమిత్రోవ్‌, కిరియోస్‌ హోరాహోరీ..: సెమీఫైనల్లో నడాల్‌తో తలపడే అవకాశమున్న మూడో సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) మూడోరౌండ్‌ను అధిగమించేందుకూ శ్రమించాల్సి వచ్చింది. రెండోరౌండ్‌లో ఓ క్వాలిఫయర్‌తో ఐదు సెట్లపాటు పోరాడిన దిమిత్రోవ్‌... ఇప్పుడు నాలుగు సెట్లపాటు శ్రమించాడు. రష్యా భావి ఆశాకిరణం ఆండ్రీ రబ్లెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-3, 4-6, 6-4, 6-4తో దిమిత్రోవ్‌ కష్టపడి నెగ్గాడు. తదుపరి రౌండ్‌లో స్థానిక ఆటగాడు నిక్‌ కిరియో్‌సను దిమిత్రోవ్‌ ఢీకొంటాడు. 17వ సీడ్‌ కిరియోస్‌ కూడా మూడు గంటలకుపైగా హోరోహోరీగా సాగిన పోరులో చెమటోడ్చాల్సివచ్చింది. మాజీ ఫైనలిస్ట్‌, 15వ సీడ్‌ జొ విల్‌ఫ్రెడ్‌ సొంగా (ఫ్రాన్స్‌)తో మూడు టైబ్రేకర్లకు దారితీసిన మూడో రౌండ్‌లో కిరియోస్‌ 7-6 (5), 4-6, 7-6 (6), 7-6 (5)తో విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆరోసీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 7-6 (4), 6-3, 7-6 (4)తో హారిసన్‌ (అమెరికా)ని, సెపి (ఇటలీ) 6-3, 7-6 (4), 6-7 (3), 6-7 (5), 9-7తో కర్లోవిక్‌ (క్రొయేషియా)ని, 10వ సీడ్‌ బుస్టా (స్పెయిన్‌) 7-6 (4), 4-6, 7-5, 7-5 తో ముల్లర్‌ (లక్సెంబర్గ్‌)ని, ఎడ్మండ్‌ (బ్రిటన్‌) 7-6 (0), 3-6, 4-6, 6-0, 7-5తో బసిలాష్విలీ (జార్జియా)ని ఓడించారు.

ఆస్ర్టేలియా మలమలమాడుతోంది

వాతావరణ అసమతౌల్యంతో ఈవేసవిలో ఆస్ర్టేలియా మలమలమాడుతోంది. శుక్రవారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టేందుకు భయపడ్డారు. అయినా ‘హీట్‌ పాలసీ’ అమలు చేసేందుకు ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు ససేమిరా అంటున్నారు. ఐదోరోజు మ్యాచ్‌లను నిలిపివేసేందుకుగానీ, రూఫ్‌లు మూసి పోటీలు జరిపేందుకుగానీ ముందుకు రాలేదు. పైపెచ్చు ‘వారంతా ప్రొఫెషనల్‌ అథ్లెట్లు’ అని అంటూ ఎలాంటి వాతావరణంలోనైనా ఆడాల్సిందేనని ఆటగాళ్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయంటూ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిందని సెర్బియా వీరుడు జొకోవిచ్‌ అన్నాడు. 

 

Related Posts