YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

బీఎస్ 4 వాహానాలపై భారీ రాయితీలు

బీఎస్ 4 వాహానాలపై భారీ రాయితీలు

బీఎస్ 4 వాహానాలపై భారీ రాయితీలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 29
ధారణంగా వాహనాల ధరలు ప్రతి సంవత్సరం పండగల సందర్భంలో కాని, సంవత్సరం చివరల్లో కాని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వాహనాల ధరలు తగ్గించే అవకాశం ఉందని ఆయా డీలర్లకు ముందస్తు సమాచారం అందితే నష్టనివారణ చర్యల్లో భాగంగా తమ వాహనాలపై భారీ ఎత్తున వాహనాలపై పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటిస్తూ తమ అమ్మకాలను పెంచుకుంటాయి. అయితే ఎప్రిల్ 1 నుంచి ప్రస్తుతం వినియోగంలో ఉన్న భారత్ స్టేజ్ 4 వాహనాలను నిలిపివేసి పర్యావరణానికి హానీ కలగని భారత్ స్టేజ్ 6 ( బిఎస్ 6) వాహనాలను మాత్రమే అమ్మాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఆయా వాహనాల యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేక పోవడంతో భారత్‌స్టేజ్ 4 వాహనాల నిలుపులదల తప్పని సరైంది. దీంతో ఆయా కంపెనీల నిర్వాహకులు ఎప్రిల్ 1 నాటికి తమ వద్ద ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకునే పనిలో భాగంగా వారివద్ద ఉన్నవాహనాలపై పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించాయి.ఇప్పటికే హోండా తమ కంపెనీకి చెందిన వాహనాలపై 10 నుంచి 15 వేల వరకు రాయితీలను ప్రకటించి వినియోగదారులను ఆకర్షించే పనిలో ఉండగా మిగతా కంపెనీలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. ఇందు కోసం నగరంలో ఉన్న సుమారు 200 వాహన డీలర్లు తమ ఎగ్జిక్యూటివ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మార్చి చివరి నాటికి కి తమ వద్ద ఉన్న స్టాక్‌ను పూర్తి స్థాయిలో అమ్మకునే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నెలాఖరున వాహనాలపై 20 నుంచి 35 వేలరూపాయల రాయితీని ప్రకటించండంతో అధిక సంఖ్యల్లో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఇచ్చారు .దాంతో రవాణాశాఖ సర్వర్‌పై దాని ప్రభావం పడి మోరాయించడంతో వాహనాల అమ్మకాలు జరిగినా రిజిస్ట్రేషన్‌లో జాప్యం జరగడంతో అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. దాంతో వాహనడీలర్లు కోర్టును ఆశ్రయించి ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవాల్సి వచ్చింది.నాలుగు సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులకు ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని షోరూం నిర్వాహకులు వినయక్ కుమార్ తెలిపారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ భాధ్యత షోరూం నిర్వాహకులకు ఇవ్వడంతో గతంలో వచ్చిన సమస్యలు పునరావృతం కావని చెబుతున్నారు. అంతే  కాకుండా అప్పుడు మార్కెట్లో పోటీ పడి మోడళ్ళను విడుదల కావడంతో తాము వాటిని అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డామని కాని, పరిస్థితులు నేర్పిన గుణపాఠంతో ముందు  జాగ్రత్తపడ్డామని తెలిపారు. అంతే కాకుండా కంపెనీల నిర్వాహకులు బిఎస్ 4 వాహనాల తయారీని గత సంవత్సరం నుంచి క్రమేపి తగ్గించుకుంటు వచ్చారని, ప్రస్తుతం బిఎస్ 4 వాహనాలతో బిఎస్ 6 వాహనాలను అమ్ముతున్నట్లు చెప్పారు.బిఎస్ 4తో పోలిస్తే వీటిలో కాలుష్యం వెదజల్లే అవకాశం తక్కువగా ఉంటుంది. వాహనాలకు కార్పోరేటర్ల స్థానంలో ఇంజక్టర్లు ఏర్పాటు  చేయడంతో ప్రతి ఇంధనపు చుక్క సద్వినియోగం అవుతుంది. ఇంజక్టర్లు డైరక్టుగా ఇంజన్‌కు అందడంతో వృథా అయ్యే అవకాశం తక్కుగా ఉండటమే కాకుండా తద్వారా మైలేజ్ కూడా  పెరుగుతుంది. గతంలో వాహనాలను ప్రతి 2500 కిలో మీటర్లకు తప్పకుండా సర్వీస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అందుబాటులోకి రానున్న బిఎస్ 6తో 3500 నుంచి 4000 కిలో  మీటర్ల వరకు వాహనాలను సర్వీస్ చేయించు కోవాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా వాహనాల టైర్లలో నైట్రోజన్ గాలి నింపేందుకు ఏర్పాట్లు చేయడంతో వాహనాల టైర్ల వ్యవస్థ కూడా  దెబ్బతినదు . అంతే కాకుండా ఆయా టైర్లలో గాలిని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఏబిఎస్ ( యాంటీ బ్రేకింగ్ సిస్టం ) ఏర్పాటుతో సురక్షత భద్రత.  క్యాథలిక్ కన్వర్టర్ ఏర్పాటుతో కాలుష్యం పూర్తి స్థాయిలో అదుపులో ఉంటుంది.

Related Posts