YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

మాఫియా ఇష్టారాజ్యం

మాఫియా ఇష్టారాజ్యం

మాఫియా ఇష్టారాజ్యం (మెదక్)
మెదక్, ఫిబ్రవరి 29జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది ముఖ్యంగా శివ్వంపేట, తూప్రాన్‌ మండలాల సరిహద్దు గ్రామాల్లో అసైన్డ్‌ భూముల్లో ఇసుకను తోడేస్తున్నారు.  కొన్ని నెలలుగా చేస్తున్న ఈ దందాతో అసైన్డ్‌ భూములు వాగులను తలపిస్తున్నాయి. శివ్వంపేట మండలం గుండ్లపల్లి, తూప్రాన్‌ మండలం పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామాల పరిధిలో వాగు  పరిసరాల్లో పొక్లెయినర్లు, జేసీబీ యంత్రాలతో ఇసుకను తవ్వుతున్నారు. తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలో అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఇసుక తవ్వి వందల టిప్పర్లలో హైదరాబాద్‌ జంట నగరాలకు తరలిస్తున్నారు. దీంతో సాగుభూములు కాస్త లోయలుగా మారి వాగు రూపం కోల్పోయాయి. అక్రమంగా తరలిస్తున్న ఒక్కో టిప్పర్‌ ఇసుక రూ.40 నుంచి రూ.50 వేల  వరకు విక్రయిస్తుండటం గమనార్హం. అర్ధరాత్రి గుట్టు చప్పుడు ఇసుక, మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇలా కొన్ని నెలలుగా చేస్తున్నా ఎవరూ అడ్డుకట్ట వేయలేదు. ఇదివరకు తవ్వకాలు జరపడంతో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వాగులో ఉన్న దారిలో రెండుచోట్ల వాహనాల రాకపోకలు సాగకుండా అడ్డంగా కందకం తవ్వించారు. అక్రమార్కులు ఆ కందకాలను  పూడ్చివేసి తిరిగి వారి పని కానిచ్చేస్తున్నారు.  అక్రమ ఇసుక, మట్టి దందాపై గ్రామస్థులు సమాచారం ఇచ్చి వాహనాలను పట్టించినా అధికారులు మొక్కుబడిగా స్పందిస్తున్నారు. వందల  టిప్పర్లలో ఇసుక, మట్టిని తరలిస్తున్నా  పట్టించుకోవడం లేదు. ఆ వ్యాపారులకు పదుల సంఖ్యలో టిప్పర్లు ఉన్నా దొరికిన ఒక టిప్పర్‌ను మాత్రమే స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి  చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమ వ్యాపారం చేసేచోట అధికారులు సిబ్బందిని నిఘా ఉంచకపోవడంతో యథారీతిలో సాగి పోతున్నాయి. ఇదివరకు వాగు పరిసరాల్లో  ఇసుక ఫిల్టర్లు నిర్మించి మట్టిని ఇసుకగా మార్చేవారు. దాన్ని పట్టణాలకు తరలించి విక్రయించేవారు. ప్రస్తుతం అవి నిలిచిపోగా నగరాల్లోనే ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి  ఇసుకతో కూడిన మట్టిని టిప్పర్లలో తరలించి ఫిల్టరు చేస్తున్నారు. ఇక్కడి మట్టిని  టిప్పర్లలో తరలించి గండిమైసమ్మ ప్రాంతంలో ఓ భారీ ఇసుక ఫిల్టరు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరికొందరు స్థానికంగా వాగు సమీపంలో బోరుబావుల నీటితో ట్రాక్టర్లలో మట్టిని కడిగి ఇసుకగా మారుస్తున్నారు.

Related Posts