YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం

తెలంగాణ భాషా, సంస్కృతికి నెలవు

తెలంగాణ భాషా, సంస్కృతికి నెలవు

హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌లో ప్రత్యేక స్టాళ్లు.. విశేషాలు

తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో తొలిసారిగా ప్రత్యేక పుస్తక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. సమాజ పథగామిగా దిశానిర్దేశం చేసిన 153 మంది తె లంగాణ వైతాళికుల జీవన రేఖల్ని ‘తెలంగాణ తేజోమూర్తులు’ పుస్తకంగా భాషా, సాంస్కృతిక శాఖ ప్రచురించింది. అంతేగాక ప్రముఖ జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సినారెకు ప్రముఖులతో అనుభవాలు, జ్ఞాపకాలు, వ్యాసాలు, కవితలు, అరుదైన చిత్రమాలిక తదితర సమాహారం ‘స్మరనారాయణీయం’ గ్రంథం ఈ స్టాల్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 442 కవుల కవిత్వ సంకలనం ‘తొలిపొద్దు’ పుస్తకాన్ని భాషా, సాంస్కృతిక శాఖ ప్రచురించింది. వీటితోపాటు ‘పటం కథలు’, ‘కళా తెలంగాణ’, ‘తంగేడు వనం’ వంటి తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, కళా వైభవాన్ని ప్రతిబింబించే పుస్తకాలు స్టాల్‌ నెంబర్‌ 238లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి కొనుగోలుపై 20 శాతం రాయితీ ఇస్తున్నారు.

సాహిత్య అకాడమీ ప్రచురణలు

తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా బుక్‌ఫెయిర్‌లో తొలిసారిగా ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ‘శాతవాహనుల నుంచి కాకతీయుల దాకా’, ‘తెలంగాణ పదకవితా వైభవం’, ‘మూడు తరాల తెలంగాణ కథ’, ‘తెలంగాణ సామెతలు’, ‘తెలంగాణ నవలా ప్రక్రియ’, ‘మాదిరాజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం’, ‘శాతవాహనుల వారసత్వం’, ‘తెలంగాణ సినీగేయ వైభవం’ వంటి పలు తెలంగాణ చారిత్రక, సాహిత్య పుస్తకాలెన్నో సాహిత్య అకాడమీ స్టాల్‌ నెంబర్‌ 237లో లభ్యమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ను మంచి వక్తగా తీర్చిదిద్దిన పుస్తకం ఇరివెంటి కృష్ణమూర్తి రచించిన ‘వాగ్భూషణం భూషణం’ ఈ స్టాల్‌లో లభిస్తోంది.

ప్రముఖ ప్రచురణ సంస్థ పీకాక్‌ క్లాసిక్స్‌

ప్రపంచంలోనే అరుదైన కొన్ని వైజ్ఞానిక, సాహిత్య పుస్తకాలను తెలుగు పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తున్న ప్రచురణ సంస్థల్లో ప్రముఖమైంది పీకాక్‌ క్లాసిక్స్‌. 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రచురణ సంస్థ పిల్లల పుస్తకాలు మొదలు తత్వశాస్త్ర గ్రంథాలు, సామాజిక శాస్త్ర, బౌద్ధ, జీవిత చరిత్రలు, భారతీయ, అంతర్జాతీయ కథాసాహిత్యం, సైన్స్‌ పుస్తకాలు వంటి మొత్తం 100 టైటిల్స్‌ను ప్రచురించింది. ‘వాల్మీకి రామాయణం’, ‘పోతన భాగవతం’, ‘వచన సూత పురాణం’ వంటి పురాణ సాహిత్యంతోపాటు, ‘ప్లేటో రచనలు’, ‘కాంట్‌ రచనలు’, ‘భారతీయ తత్వశాస్త్రం 4 సంపుటాలు’, ‘ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ జీవితం’, ‘డార్విన్‌ ఆత్మకథ’, ‘జగదీశ్‌ చంద్రబోస్‌’, ‘మేరీక్యూరీ’, ‘ఆచార్య రంగ’ వంటి పలువురు మహా వ్యక్తుల జీవిత చరిత్రలను పీకాక్‌ క్లాసిక్స్‌ ప్రచురించింది. ‘కాలం కథ’, ‘కాలబిలాలూ పిల్ల విశ్వాలూ’, కల్లోల ప్రపంచం’ వంటి పలు అరుదైన ప్రకృతి శాస్త్ర పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. ‘వేమన ద్విభాషా శతకం’, ‘జర్మన్‌ జానపద కథలు’, ‘ముల్లా నస్రుద్దీన్‌ కథలు’, ‘ఆస్కార్‌వైల్డ్‌ కథలు’ వంటి పలు బాలల సాహిత్య పుస్తకాలను పీకాక్‌ క్లాసిక్స్‌ ముద్రించింది. వీటితోపాటు ‘షేక్స్‌ఫియర్‌ కథలు’, ‘మోపాస కథలు’, ‘ఆన్‌ఫ్రాంక్‌’, ‘ఓ బాలిక డైరీ’ వంటి పలు భారతీయ, అంతర్జాతీయ కథా సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకొచ్చిన ఘనత పీకాక్‌ సంస్థకే దక్కుతుంది. పీకాక్‌ క్లాసిక్స్‌ ప్రచురణల స్టాల్‌ నెంబర్‌ 303. ప్రతి రూ.300 కొనుగోలుపై 30 శాతం రాయితీ ఇస్తున్నారు.

సామాజిక శాస్త్ర రచనలకు లిఖిత ప్రెస్‌ 

తెలుగు సమాజానికి హక్కుల గళంగా నిలిచిన నేత, సామాజిక, రాజకీయ, ఆర్థిక, చారిత్రక విశ్లేషకులు, మేధావి బాలగోపాల్‌ రచనలన్నీ స్టాల్‌ నెంబర్‌ 202లో కొలువుదీరిన ‘లిఖిత ప్రెస్‌’లో అందుబాటులో ఉన్నాయి. కాలువ మల్లయ్య రచించిన ‘అస్పృశ్య కోయిల’ నవల, 20వ శతాబ్దపు భారతీయ మహిళల రచనల సంకలనం ‘దారులేసిన అక్షరాలు’, సమాజంలోని విభిన్న వర్గాల జీవన స్థితిగతులను పిల్లల కోసం కథల రూపంలో వచ్చిన ‘డిఫరెంట్‌ టేల్స్‌’, గౌరీలంకేశ్‌ రచించిన ‘కొలిమి రవ్వలు’ తెలుగు అనువాదంతోపాటు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ముద్రణలు, అబ్బూరి ఛాయాదేవి రచనలు, తెలిదేవర భానుమూర్తి ‘పలుకుబడి’, ఒమ్మి రమే్‌షబాబు కథలు, సతీష్‌ చందర్‌ నవలలు, తెలుగునాట సంచలనమైన త్రిపురనేని శ్రీనివాస్‌ ‘హో’ వంటి పలు సాహిత్య పుస్తకాలు ఈ స్టాల్‌లో అందుబాటులో ఉన్నాయి

భవిష్యత్తు కోసం ‘సాహిత్య సమాలోచన’

పుస్తక ప్రదర్శన జరిగే పది రోజులూ ‘‘సాహిత్య సమాలోచన’’ పేరుతో తెలంగాణ సాహిత్యంపై ప్రత్యేకమైన సదస్సులు నిర్వహించడం మంచి సందర్భం. కవిత్వం, కథ, నవలా సాహిత్యం, సినిమా, శాసనాలు, చరిత్ర పరిశోధన వంటి పలు అంశాలపై పనిచేస్తున్న కొంత మంది ప్రముఖులతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం. ‘‘వర్తమాన తెలంగాణ నవల’’, ‘‘దళిత స్త్రీవాద, మైనార్టీ బీసీవాద కవిత్వ గమనం’’, ‘‘ఈ తరం తెలంగాణ సినీదర్శకులు’’, ‘‘బాలసాహిత్యం దశదిశ’’, కె.శ్రీనివాస్‌ పరిశోధనా గ్రంథం ‘‘తెలంగాణ సాహిత్య వికాసం-విశ్లేషణ’’తో పాటు ప్రత్యేకంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాసిన ‘గొల్ల రామవ్వ’’ కథపై ప్రత్యేక చర్చ నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులకు నేను అనుసంధాన కర్తగా ఉన్నాను. సాహిత్య వికాసాన్ని నలుచెరలా వ్యాపింపజేసేందుకు ఇలాంటి సమావేశాలు నిర్వహించ తలపెట్టిన బుక్‌ఫెయిర్‌ నిర్వాహకుల కృషి అభినందనీయం.మని అన్నారుసాహిత్య సమాలోచన’ సదస్సు, అనుసంధానకర్త ఆచార్య ఎస్‌.రఘు అన్నారు.

‘టింక్‌లింగ్‌ ఆఫ్‌ ది బెల్‌’’.. ఓ రొమాంటిక్‌ నవల. గతేడాది డిసెంబర్‌లో ఆన్‌లైన్‌ ఈ బుక్‌గా ఈ నవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 17న అమేజాన్‌లో అమ్ముడైన ఐదు నవలల్లో ఒకటిగా నిలిచింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలో నిలిచింది. ఇంతకీ ఈ నవలా రచయిత్రి మరెవరో కాదు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య సతీమణి సోనికా శాండిల్య. శుక్రవారం పుస్తక ప్రదర్శనను సందర్శించిన ఆమె వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ‘‘ప్రకృతి పట్ల నాకున్న ప్రేమతో ఈ నవల రాశాను. ఇది నా తొలొ నవల అయినప్పటికీ ఎక్కువ మందికి చేరగలగడం ఆనందంగా ఉంది. అన్ని ప్రధాన బుక్‌ మాల్స్‌లోనూ, అమేజాన్‌ వంటి ఈ బుక్స్‌లో నా నవల అందుబాటులో ఉంది. అసలు రొమాన్స్‌ అంటే ఏంటి. నాకు చంద్రుడు అంటే చాలా ఇష్టం. జలపాతాలంటే ఇంకా ఇష్టం. వాటిపట్ల నాకున్న రొమాన్స్‌.. అలా ప్రకృతి పట్ల నాకున్న ఇష్టంతోపాటు, జాతీయతా భావం, బంధాలు, ఆత్మీయతలు, నైతికవిలువలు వంటి పలు విషయాల సమాహారంగా ఈ నవలను రాశానని’.నవలా రచయిత్రి సోనికా శాండిల్య తెలిపారు.

బాధిత మహిళలకు బాసట ..

సమస్యల్లో ఉన్న మహిళలు, బాలికల కోసం భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకంగా పనిచేస్తోంది. బాధిత మహిళలకు బాసటగా నిలిచేందుకు ఉచిత హెల్ప్‌లైన్‌ నిర్వహిస్తున్నారు. గృహహింస, లైంగిక వేధింపుల నిరోధక చట్టం, బాల్యవివాహాల నిరోధక చట్టం, పీసీపీఎన్‌డీటీ యాక్టు వంటి పలు మహిళా రక్షణ చ ట్టాల సంరక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న భూమిక హెల్ప్‌లైన్‌ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ‘మహిళల చట్టాలను ప్రజల్లో ప్రచారం చేయడంతోపాటు బాధిత మహిళలకు బాసటగా భూమిక హెల్ప్‌లైన్‌ ఉందన్న అవగాహనను పెంపొందించేందుకే ఈ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశామని’ నిర్వాహకురాలు సత్యవతి కొండవీటి చెబుతున్నారు. బాధిత మహిళలు సంప్రదించాల్సిన ఉచిత హెల్ప్‌లైన్‌ నెంబర్‌ : 1800 425 2908. భూమిక హెల్ప్‌లైన్‌ స్టాల్‌ నెంబర్‌ 248.

సామాజిక శాస్త్ర రచనలకు లిఖిత ప్రెస్‌ 

తెలుగు సమాజానికి హక్కుల గళంగా నిలిచిన నేత, సామాజిక, రాజకీయ, ఆర్థిక, చారిత్రక విశ్లేషకులు, మేధావి బాలగోపాల్‌ రచనలన్నీ స్టాల్‌ నెంబర్‌ 202లో కొలువుదీరిన ‘లిఖిత ప్రెస్‌’లో అందుబాటులో ఉన్నాయి. కాలువ మల్లయ్య రచించిన ‘అస్పృశ్య కోయిల’ నవల, 20వ శతాబ్దపు భారతీయ మహిళల రచనల సంకలనం ‘దారులేసిన అక్షరాలు’, సమాజంలోని విభిన్న వర్గాల జీవన స్థితిగతులను పిల్లల కోసం కథల రూపంలో వచ్చిన ‘డిఫరెంట్‌ టేల్స్‌’, గౌరీలంకేశ్‌ రచించిన ‘కొలిమి రవ్వలు’ తెలుగు అనువాదంతోపాటు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ముద్రణలు, అబ్బూరి ఛాయాదేవి రచనలు, తెలిదేవర భానుమూర్తి ‘పలుకుబడి’, ఒమ్మి రమే్‌షబాబు కథలు, సతీష్‌ చందర్‌ నవలలు, తెలుగునాట సంచలనమైన త్రిపురనేని శ్రీనివాస్‌ ‘హో’ వంటి పలు సాహిత్య పుస్తకాలు ఈ స్టాల్‌లో అందుబాటులో ఉన్నాయి.

 

 

 

 

Related Posts