YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఇసుక మాఫియా.. 

ఏపీలో ఇసుక మాఫియా.. 

ఏపీలో ఇసుక మాఫియా.. 
ఎమ్మెల్యేలు 67, మంత్రులు 10 మంది’
విజయవాడ, మార్చి 2,
నూతన ఇసుక విధానం పేరుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాఫియాకు రూపకల్పన చేసిందని గుంటూరు జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఇసుక అక్రమాలపై సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌‌రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇసుక మాఫియాలో 67 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు, నలుగురు ఎంపీలు ఉన్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.ముఖ్యమంత్రి జగన్‌కు తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేస్తున్న దోపిడీ కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే అనగాని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నదులు, చెరువులు, వాగులు, వంకలను కూడా వదలకుండా ఇసుకను తవ్వేస్తున్నారని ఆరోపించారు. గతంలో రూ.1,500 ఉన్న ట్రాక్టర్ ఇసుక ధర ఇప్పుడు రూ.5 వేలకు చేరిందని.. రూ. 10 వేలు ఉన్న లారీ ఇసుక ధర రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అమ్ముతున్నారని అనగాని విమర్శించారు.ఇసుక అక్రమాలపై ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నంబర్ 14500కు సమాచారం అందించినా పట్టించుకునేవారే లేరని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఇసుక రీచ్‌ల పంపకాల్లో తలెత్తిన ఘర్షణల కారణంగా వైసీపీ నేతలు రోడ్డెక్కిన విషయం సీఎం జగన్‌ దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. గత టీడీపీ హయాంలో ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చామని అనగాని గుర్తు చేశారు.

Related Posts