YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణలో పాలకు భారీ డిమాండ్

తెలంగాణలో పాలకు భారీ డిమాండ్

తెలంగాణలో పాలకు భారీ డిమాండ్
నిజామాబాద్, మార్చి 2,
రాష్ట్రంలో పాలు  కొరత భారీగా ఉంది. పాల పొడి నిల్వలు అడుగంటిపోగా.. ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్‌‌‌‌ పెరగడంతో పాల కొరత ఏర్పడుతోంది. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న టైమ్లో మిగులు పాలను పొడిగా మార్చి నిల్వ చేసేవారు. పాల కొరత ఏర్పడినపుడు పొడిని రీకన్వర్ట్‌‌‌‌ చేసి పాలను మార్కెట్‌‌‌‌లో విక్రయించే వారు. రెండు, మూడు నెలలుగా పాల కొరత ఏర్పడడంతో ఉన్న పాల పొడినంతా డెయిరీలు వాడేశాయి. దీంతో ఇప్పుడు పాలు లేవు, పొడి లేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో డిమాండ్‌‌‌‌కు సప్లైకి మధ్య 7.50 లక్షల నుంచి 10 లక్షల లీటర్ల వరకు గ్యాప్‌‌‌‌ ఉందని మార్కెట్‌‌‌‌ అంచనాలు ఉన్నాయి.రాష్ట్రంలో స్కిమ్‌‌‌‌ మిల్క్‌‌‌‌ పౌడర్‌‌‌‌(ఎస్‌‌‌‌ఎంపీ) నిల్వలు పూర్తిగా అయిపోయాయి. దీంతో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్(ఎన్డీడీబీ)ద్వారా కొనే పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో పాలపొడి నిల్వలు పెరిగి వాటిని విదేశాలకు ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేసే పరిస్థితి ఉండేది. ఒక్కో డెయిరీలో కనీసం మూడు నెలలకు సరిపడా పాల పొడి నిల్వలు ఉండేవి. పాలకొరత ఉంటే పొడి నిల్వలను వినియోగించి పాల ఉత్పత్తి చేస్తారు. మరోవైపు పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాల పొడి ధరలు రెట్టింపు అయ్యాయి. పాల పౌడర్‌‌‌‌ గత ఏడాది ఇదే సమయానికి కిలో రూ.140 నుంచి రూ.150 వరకు ఉండేది. ఇప్పుడు రూ.335 నుంచి రూ.350 వరకు పెరిగిపోయింది. విజయ డెయిరీ పాల కొరత నుంచి బయట పడడానికి  ఇటీవల ఎన్‌‌‌‌డీడీబీ నుంచి 300 టన్నుల పాల పొడి కొనుగోలు చేసినట్లు సమాచారం. వేసవిలో పాల కొరతను దాటాలంటే దాదాపు 1,200 టన్నుల పాల పొడి అవసరమయ్యే  అవకాశం ఉంది.విదేశాల నుంచి పాల పొడి దిగుమతి చేసుకోవాలన్న కేంద్రం ప్రతిపాదనలకు గతంలో రీజినల్‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌ విభాగం అభ్యంతరం తెలిపింది. ఇంపోర్ట్స్‌‌‌‌ వల్ల దేశంలో పాల ధరలు  పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ విదేశాల నుంచి పాల పొడి దిగుమతులను వ్యతిరేకించిన డెయిరీలు ఇప్పుడు.. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాల నుంచి పాల పొడిని దిగుమతి చేసుకోవాలని మూడు నెలలుగా కేంద్రానికి మొర పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దీనిపై పది రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రాలవారీగా పాల ఉత్పత్తుల అవసరాలు ఎలా ఉన్నాయి.. స్థానికంగా పాల ఉత్పత్తి ఎలా జరుగుతోందని ఎన్డీడీబీ రాష్ట్రాలను ఆరా తీస్తోంది. విదేశాల నుంచి పాల పొడిని ఇంపోర్ట్ చేసుకుంటే కొరతను దాటొచ్చని భావిస్తున్నట్టు సమాచారం.

Related Posts