YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

శివార్లలో రియల్ బూమ్

శివార్లలో రియల్ బూమ్

శివార్లలో రియల్ బూమ్
రంగారెడ్డి, మార్చి 2,
హైద్రాబాద్ కోర్ సిటీకి 20 కి.మీ.ల దూరంలో ఉన్న కొంపల్లి… రియల్ ఎస్టేట్ పరంగా ఫుల్ డిమాండ్ ఉంది. భారీ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తుండగా, కమర్షియల్ స్పేస్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ధీటుగా మాల్స్, మల్టిపెక్సులు రంగ ప్రవేశం చేస్తుండగా నేషనల్ హైవే, ఓఆర్ఆర్ దగ్గరగా ఉండటంతో ప్రాజెక్టులకు ఫుల్ గిరాకీ ఉంది.  ఒకప్పుడు కోర్ సిటీలోనే ఇల్లు ఉండాలి, పక్కనే ఆఫీసు ఉండాలి, ఆ పక్కనే స్కూలు లేదా కాలేజీ ఉండాలనే భావన నుంచి ప్రశాంతంగా ఉండే ఏరియా అయితే చాలనేలా జనాల టేస్టు మారిపోయింది. దీంతో కోర్ సిటీలో రియల్ మార్కెట్ కు ఉన్న డిమాండ్ శివారు ప్రాంతాల వరకు విస్తరించింది. ఇక నేషనల్ హైవే, ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ వంటి రోడ్డు సదుపాయాలు ఉన్న ఏరియాలకు శరవేగంగా డిమాండ్ వస్తోంది. అలాంటి ప్రాంతల్లో కొంపల్లి ఒకటి. ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న కొంపల్లి, ఇటీవలే  మున్సిపాలిటీగా మారింది. ఓఆర్ఆర్ స్పెషల్ అట్రాక్షన్…అరగంట జర్నీ చేస్తే ఓఆర్ఆర్ కు చేరుకునే వెసులుబాటు ఉండటమే కొంపల్లికి వరంలా మారింది. జేబీఎస్, ప్యారడైజ్, సికింద్రాబాద్ మెట్రో స్టేషన్లు దగ్గరలోనే ఉండటంతో రెసిడెన్షియల్  సెగ్మెంట్ పరంగా గిరాకీ బాగా పెరుగుతోంది. గత రెండేళ్ల నుంచి అపార్టుమెంట్లు విస్తరిస్తున్న క్రమంలో నిజామాబాద్, కరీంనగర్, సిద్ధిపేట జిల్లా వాసులు ఇక్కడ ఉండేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఐటీ కారిడార్ కు వెళ్లే మార్గం విస్తరణ ప్రతిపాదన ఉండటంతో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు అద్దెకు కావాలంటే రూ. 8 వేల నుంచి రూ.12 వేలు పెడితేగానీ దొరికే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 4 వేల నుంచి మొదలవుతుండగా రూ.5వేల లోపే డబుల్ బెడ్రూం ఇళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతోపాటు లగ్జరీ, ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం కూడా జోరుగా సాగుతోంది. అదేవిధంగా కూకట్ పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బొల్లారం, సుచిత్ర, ఆల్వాల్, తిరుమలగిరి, బృందావన కాలనీ వంటి ప్రాంతాలు దగ్గరగా ఉండటం, ఓఆర్ఆర్ వెంబడి నేరుగా గమ్య స్థానాలకు చేరుకునే వెసులుబాటు తో రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.కొంపల్లి,  దుండిగల్, గండిమైసమ్మ వంటి ప్రాంతాలు ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఐటీ కారిడార్ లో పెరిగిన రద్దీ నేపథ్యంలో వెస్ట్ టు ఈస్ట్ సిటీకి ఐటీ కంపెనీలను తరలించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ ను మరో ఐటీ హబ్ గా మార్చేందుకు దుండిగల్ ప్రాంతంలో ఐటీ పార్కు నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఇటీవలే  మేడ్చల్ జిల్లా అధికారులు కూడా భూ పరిశీలన, సేకరణ కార్యాచరణ పై దృష్టి పెట్టారు. రానున్న రోజుల్లో మరో ఐటీ హబ్ గా ఆ ప్రాంతం మారనుంది. కొంపల్లి నుంచి ప్రతిపాదిత ఐటీ పార్కు  5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటికే రెసిడెన్షియల్ మార్కెట్ కు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని అపార్టుమెంట్లు అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంటున్నారు.ఇటీవల కొంపల్లి మున్సిపాలిటీ కావడంతో మౌలిక వసతులు మరింత పెరిగే అవకాశం ఉంది. రోడ్లు, తాగునీటి వసతులు, షాపింగ్ మాల్స్, ఎంటర్ టైన్ మెంట్ జోన్లకు అనువుగా కొంపల్లి రూపు మార్చుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతోంది. వచ్చే ఐదేళ్లలో అపార్టుమెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయని స్థానిక రియల్  ఎస్టేట్ సంస్థ ఏజెంట్ కరీం చెబుతున్నారు. ఇప్పటికే ఇండిపెండెంట్ ఇళ్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన  చెప్పారు.

Related Posts