YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

జీఎస్టీ బిల్లుని మరింత పకడ్బంధీ గా అమలు పై కేంద్రం దృష్టి

జీఎస్టీ బిల్లుని మరింత పకడ్బంధీ గా అమలు పై కేంద్రం దృష్టి

 

జీఎస్టీ బిల్లుని మరింత పకడ్బంధీ గా అమలు పై కేంద్రం దృష్టి
ఏప్రిల్ 1 నుంచి రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య లాటరీ ఆఫర్లు
హైదరాబాద్ మార్చ్ 2 
జీఎస్టీ బిల్లుని మరింత పకడ్బంధీ గా అమలు చేయడం పై దృష్టి సారించింది. కొనుగోలు చేసిన ప్రతి విక్రేతల నుంచి బిల్లు తీసుకునేలా కొనుగోలుదారులను ప్రోత్సహించే విధమైన చర్యలకు సిద్ధపడుతోంది. ఇందులో భాగంగా కేంద్రం జీఎస్టీ కి లాటరీ ద్వారా భారీ ఆఫర్లు ప్రకటించనుంది. జీఎస్టీ వినియోగదారుల లావాదేవీలు (బీ టూ సీ) వ్యాపారాల ఇన్వాయిస్ లపై ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహించనుంది. ఏప్రిల్ 1 నుంచి రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య లాటరీ ఆఫర్లను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వస్తువుల కొనుగోళ్లు సందర్భం గా తప్పని సరిగా బిల్లులు తీసుకునేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వస్తువులు కొన్న తర్వాత వినియోగదారులు తీసుకునే బిల్లు ద్వారా లాటరీని గెల్చుకోవడానికి అర్హత పొందుతారు. ఈ పథకం కింద రెవెన్యూ విభాగం నెలవారీ లక్కీ డ్రాలను నిర్వహిస్తుంది. ఇందులో ఒక బంపర్ బహుమతితో పాటు రెండవ  మూడవ బహుమతులు రాష్ట్రాల వారీగా ఉంటాయని ఒక అధికారి తెలిపారు.దీని ప్రకారం కస్టమర్ మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు బిల్లును స్కాన్ చేసి జీఎస్టీ నెట్ వర్క్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ యాప్ ఈ నెల చివరి నాటికి ఆండ్రాయిడ్ ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. లక్కీ డ్రాకు అర్హత పొందడానికి  ఇన్వాయిస్ విలువపై ఎటువంటి పరిమితి లేదు. వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి లాటరీ మొత్తాన్ని చెల్లిస్తారు. కొనుగోలుదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేసి లాభాలు  ఆర్జించిన వ్యాపార సంస్థలపై విధించిన జరిమానాలను ఈ నిధికి బదలాయిస్తున్నారు. జీఎస్టీ ఆదాయంలో లీకేజీలను అరికట్టేందుకు లాటరీ వ్యవస్థ క్యూఆర్ కోడ్ వంటి వాటిపై దృష్టి  సారించారు.

Related Posts