YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

వ్యవసాయాన్ని నిర్లక్షం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం - సంపత్ కుమార్

వ్యవసాయాన్ని నిర్లక్షం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం - సంపత్ కుమార్

 

వ్యవసాయాన్ని నిర్లక్షం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం
- సంపత్ కుమార్
హైదరాబాద్ మార్చ్ 2 
చికెన్  కొనుగోళ్లు పడిపోకుండా స్పందించిన కేటీఆర్ కు రైతు సమస్యలు ఎందుకు పట్టడం లేదని ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ప్రశ్నించారు...రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా  ఉందని అన్నారు.పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం గాంధీ భవన్ లో మేడియా సమావేశం లో మాట్లాడుతూ  కెసిఆర్ పాలనలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోందని విమార్చించారు.కంది రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా .. ప్రభుత్వానికి నిమ్మకునీరెత్తినట్లు లేదని,కంది రైతులను  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని కోరారు.టమాటా పండించిన రైతు పరిస్థితి కూడా చాలా దయనీయంగా  ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం  .. మార్కెట్ లో కంది కొనుగోలుకు  పరిమితులు పెట్టడం సరికాదన్నారు.కంది కొనుగోళ్లలో పరిమితులు ఎత్తెయాలి .. టమాటాలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.గిట్టుబాటు ధరను కల్పించడంలో .. విత్తన సబ్సిడీ  కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది ..కాంగ్రెస్ హయాంలో ఇచ్చే వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ నీ సైతం కేసీఆర్ సర్కార్ ఎత్తేసిందన్నారు.వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ అంటే .. కేసీఆర్ సర్కార్ కు గుర్తుకొచ్చేది కేవలం ట్రాక్టర్లు మాత్రమేనాని,ట్రాక్టర్లు ఇస్తే  కమీషన్లు వస్తాయనే .. వాటిపైనే దృష్టి పెడుతున్నారని తిలిపారు.రైతు సమస్యలపై ట్విట్టర్ లోనైనా స్పందిస్తాడో ఏమో అని  ట్విట్టర్ చేసినా పట్టించు కోలేదని అన్నారు. ..
 

Related Posts