YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో కరోనా కలకలం..

విశాఖలో కరోనా కలకలం..

విశాఖలో కరోనా కలకలం..
ఒకే కుటుంబంలో ముగ్గురికి వైరస్ లక్షణాలు
విశాఖపట్టణం, మార్చి 5
విశాఖలో కరోనా వైరస్ కలకలంరేపింది. నగరంలో ఐదుగురు వైరస్ లక్షణాలతో విశాఖ ఛాతి ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకే  కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు.. వీరు ఇటీవలే మలేషియా, సింగపూర్ వెళ్లి వచ్చారు. వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి వచ్చారు. సౌదీ నుంచి వచ్చిన మరో ఇద్దరు(గాజువాకకు చెందిన ఒక యువతి, మరొక వ్యక్తికి) లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.ఐదుగురు జ్వరం, తీవ్ర జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ ఐదుగురి శాంపిల్స్‌ సేకరించి తిరుపతిలోని ల్యాబ్‌, గాంధీ ఆస్పత్రి, పుణెకు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిని ఛాతి ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో వీరికి చికిత్స అందిస్తున్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాతే కరోనాపై నిర్దారణకు  వస్తామంటున్నారు అధికారులు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు కరోనా వైరస్‌పై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపించామంటున్నారు. రిపోర్ట్ రాగానే క్లారిటీ వస్తుందని.. ప్రజలు భయపడాల్సిన పనిలేదని.. ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామంటున్నారు. ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని.. అధికారులతో జిల్లాలవారీగా  సమీక్షలు నిర్వహిస్తున్నాము అంటున్నారు.

Related Posts