YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

 ఆరేళ్లలో 120 శాతం పెరిగిన గనుల ఆదాయం

 ఆరేళ్లలో 120 శాతం పెరిగిన గనుల ఆదాయం

 ఆరేళ్లలో 120 శాతం పెరిగిన గనుల ఆదాయం
హైద్రాబాద్, మార్చి 6
గనుల ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. గణనీయమైన ఉత్పత్తిని సాధిస్తూ.. అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది.  తెలంగాణ ఏర్పాటు కాకముందు రూ.1,806 కోట్లు ఉంటే ఆదాయం గత సంవత్సరానికి రూ.3,905.90 కోట్లకు చేరుకున్నది. ప్రస్తుతం మన రాష్ట్రంలో దాదాపు 21 రకాల ఖనిజాలు విరివిగా లభిస్తున్నాయి. ఈ ఖనిజాలకు దేశ, విదేశీయ స్థాయిలో అత్యధికంగా డిమాండ్ నెలకొనడంతో గనులు, భూగర్భ శా ఖకు పెద్దఎత్తున ఆదాయం లభిస్తోంది. గత ఏడెనిమిది సంవత్సరాల్లో ఈ శాఖ భారీగా ఆ దాయాన్ని సమకూర్చుకుని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.ముఖ్యంగా గనుల శా ఖ మంత్రిగా కెటిఆర్ పదవి బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి ఈ శాఖ రాతనే మారిపోయిం ది. శాఖలో  పెద్దఎత్తున తీసుకొచ్చిన సంస్కరణ, మార్పులు, పారదర్శక విధానాలు ఆదాయం వృద్ధికి దోహదపడుతున్నాయి. ముఖ్యంగా అవినీతికి ఆలవాలమైన శాఖను పూర్తిగా ప్రక్షాళన చేశారు. అంతకుముందు కొందరు అధికారులు లీజుదారులతో కుమ్మక్కై వారికి పరోక్షంగా సహకరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొ ట్టేవారు. అలాంటి వారికి బదిలీలతో చెక్ పెట్టారు. సంవత్సరాల పాటు ఒకే చోట పాతుకుపోయిన అధికారులను పెద్దఎత్తున బదిలీలు చేశారు. కేంద్ర కార్యాలయం సహా కింది నుంచి పైస్థాయి వరకు ప్రక్షాళన చేశారు. అనుమతులు, లీజుల రెన్యువల్‌కు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. గనుల  తవ్వకాలు, తరలింపుపై నిఘాకు అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇక గనుల శాఖపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడంతో ఆదాయం  పరుగులు తీసింది. అలాగే అంతకుముందు ఉన్న ఇ సుక రీచ్‌లను వేలం వేయడం కాకుండా టిఎస్‌ఎండిసి ద్వారా ఆన్‌లైన్ కొ నుగోలు పద్ధతిని ప్రవేశపెట్టింది. దీంతో ఇసుక రీచ్‌ల వద్ద లెక్కలోకి రాని ఇసుక బాగా తగ్గి పోయింది. దీంతో పాటు గ్రానైట్ రవాణాకు సంబంధించి తనిఖీలు పెరగడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. ఫలితంగా ఆదాయం గణనీయంగా పెరిగింది. దీని కారణంగానే 2010.. 2011 సంవత్సరంలో గనుల శాఖ ఆదాయం రూ. 1,207.82 కోట్లలో ఉండగా 20182019 సంవత్సరం నాటికి రూ. 3,905.90 కోట్లకు చేరుకున్నది. అంటే గనుల శాఖ ఆదాయం అతి తక్కువ కాలంలోనే మూడు రెట్లు పెరిగింది.ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఖనిజ నిక్షేపాలకు పేరెన్నిక గన్న మిగతా  రాష్ట్రాల్లో వృద్ధిరేటు తిరోగమనంలో కొనసాగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం 34 శాతం ఆదాయ వృద్ధిని సాధించి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆ ఆర్ధిక సంవత్సరంలో లో ప్రభుత్వం గనుల శాఖ ద్వారా రూ.3,085 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా రూ. 3,169 కోట్ల ఆదాయంతో లక్ష్యాన్ని అధిగమించింది. ఉమ్మడి రాష్ట్రంలో కష్టంగా కొనసాగిన గనుల ఆదాయం తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రతి యేటా పెరుగుతూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రం  చివరి సంవత్సరం కేవలం ఒక శాతం వృద్ధి నమోదు కాగా స్వరాష్ట్రంలో మొదటి సంవత్సరం 8.93 శాతం, రెండో సంవత్సరం 20.40 శాతం, మూడో వత్సరం ఏకంగా 34 శాతం వృద్ధిని సాధించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మైనింగ్ శాఖ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. ఇసుక, గ్రానైట్‌తో పాటు బొగ్గు, ఇనుప ఖనిజం, డైమండ్, డోలమైట్, యూరేనియం, సున్నపురాయి నిక్షేపాలు, కర్మాగారాలు, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, గ్రా నైట్ కటింగ్, ఫేసిటింగ్, స్ట్రీల్, స్పాంజ్ ఐరన్, ఇనుపధాతువు, మాంగనీస్, నికెల్, క్రోమియం, వెనెడియం వంటివి మొత్తం 1,904 పరిశ్రమలు ఉన్నాయి. వీటి  లైసెన్సులు, అమ్మకాలు, లీజు, పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం భారీగా సమకూరుతోంది.

Related Posts