YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

బ్లాక్ మండే రూ.7 లక్షల కోట్లు మాయం.. .. 10 ఏళ్లల్లో ఫస్ట్ టైమ్!

బ్లాక్ మండే రూ.7 లక్షల కోట్లు మాయం.. .. 10 ఏళ్లల్లో ఫస్ట్ టైమ్!

బ్లాక్ మండే
రూ.7 లక్షల కోట్లు మాయం.. .. 10 ఏళ్లల్లో ఫస్ట్ టైమ్!
ముంబై, మార్చి 9 
దేశీ స్టాక్ మార్కెట్‌ పేకమేడలా కూలిపోయింది. బెంచ్‌మార్క్ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడం, కరోనా వైరస్ భయాలు, యస్ బ్యాంక్ సంక్షోభంతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఫైనాన్షియల్ సిస్టమ్‌పై నమ్మకం సడలడం వంటి కారణాల నేపథ్యంలో ఇండెక్స్‌లు భారీగా నష్టపోయాయి. అలాగే అంతర్జాతీయంగా కరోనా దెబ్బకి సౌదీ అరేబియా, రష్యా మధ్య చమురు యుద్ధం మొదలు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత దిగజారింది.బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 2,366 పాయింట్లు కుప్పకూలింది. 35,210 పాయింట్ల స్థాయికి క్షీణించింది. ఇక ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 662 పాయింట్ల నష్టంతో 10,327 పాయింట్లకు పడిపోయింది. చివరకు నిఫ్టీ 538 పాయింట్ల నష్టంతో 10,451 వద్ద, సెన్సెక్స్ 1,942 పాయింట్ల నష్టంతో 35,635 వద్ద క్లోజయ్యాయి.ఫైనాన్షియల్, మెటల్, ఎనర్జీ స్టాక్స్‌లో అమ్మకాలు కారణంగా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. రిలయన్స్ ఏకంగా 14 శాతం కుప్పకూలింది. గత పదేళ్లలో ఆర్‌ఐఎల్ షేరుకు ఇదే అతిపెద్ద పతనం. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.లక్ష కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్లు మాయమైంది.
✺ నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, బీపీసీఎల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. యస్ బ్యాంక్ ఏకంగా 32 శాతం పరుగులు పెట్టింది.
✺ అదేసమయంలో నిఫ్టీ 50లో ఓఎన్‌జీసీ, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఓఎన్‌జీసీ దాదాపు 16 శాతం కుప్పకూలింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 8 శాతం పతనమైంది. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 7 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 6 శాతం, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతం కుప్పకూలాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4 శాతం పడిపోయాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 5 శాతం క్షీణించింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 74 మార్క్ కిందకు పడిపోయింది. 28 పైసలు నష్టంతో 74.07 వద్ద కదలాడుతోంది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 21.45 శాతం తగ్గుదలతో 35.56 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 22.36 శాతం క్షీణతతో 32.05 డాలర్లకు పతనమైంది.

Related Posts