YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆంధ్ర ప్రదేశ్

బాలయ్య  మౌనం వెనుక...?

 బాలయ్య  మౌనం వెనుక...?

. బాలయ్య  మౌనం వెనుక...?
విజయవాడ, మార్చి 18
బాలకృష్ణ సినిమాల్లో రౌద్ర రసం బాగా పలికిస్తారు. ఆయన భారీ డైలాగులు కొడితే ఆడియన్స్ చప్పట్లు కొట్టాల్సిందే. అటువంటి బాలయ్య రాజకీయాల్లో మాత్రం ఉత్త ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. బాలకృష్ణ రాజకీయం అంతా కూడా అసెంబ్లీలో నోరు మెదపని ఎమ్మెల్యేగా రికార్డులకెక్కడంగానే ఉంది. ఇక బాలకృష్ణ మళ్ళీ సినిమాల్లో జోరు పెంచారు. ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా ఓవైపు ఉన్నారు. అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నా బాలకృష్ణ కనీసం పట్టించుకోవడంలేదంటే ఆయన ఆసక్తి ఎక్కడ ఎంత ఉందో అర్ధమైపోతోంది.ఆనాడు తండ్రి ఎన్టీఆర్ కంటే బావ దగ్గరే టీడీపీ పవిత్రంగా, పధ్ధతిగా ఉంటుందని నమ్మి జాగ్రత్తగా పార్టీని అప్పగించిన వారిలో బాలయ్య అతి ముఖ్యుడు. బాలకృష్ణ 2014 వరకూ అధికారంలో కానీ, పార్టీలో కానీ ఎక్కడా వాటా కోరుకోలేదు. ఇక బాలయ్య 2014లో ఎమ్మెల్యే అయ్యాడు. మంత్రి కావాలనుకున్నాడు. అంతా ఆయనకు మంత్రి పదవి ఇస్తారని నమ్మారు. కానీ బాబు మాత్రం ఇవ్వకుండా పక్కన పెట్టారు. తరువాత దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మరీ లోకేష్ ని మంత్రిని చేశారు. పోనిలే అని సర్దుకున్న బాలయ్యకు 2019 ఎన్నికలు మరోలా మారాయి.కేవలం 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి టీడీపీ దారుణంగా పరాభవం పాలు అయితే బాలకృష్ణ తన వంతు సాయం చేయడానికి ముందుకువచ్చారని అంటారు. తన అన్న హరికృష్ణ మరణం తరువాత ఖాళీ అయిన పొలిటి బ్యూరో పదవి అయినా తనకు ఇస్తే పార్టీ కోసం పోరాడుదామనుకున్నాడు. కొన్నాళ్ళు సినిమాలు కూడా పక్కన పెట్టాడని చెబుతారు. కానీ బాలయ్యని దరిదాపులకు రానీయకుండా పార్టీ అంతా తానూ, తన కొడుకు అన్నట్లుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తూంటే బాలకృష్ణ చూసి చూసి సినిమాల్లోకే మళ్ళీ వెళ్ళిపోయాడట. అందుకే ఆయన టీడీపీలో ఏం జరిగినా అసలు పట్టించుకోవడంలేదుట.ఇక తనకు ప్రాణ స్నేహితుడుగా ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన కదిరి బాబూరావు టీడీపీని వీడి వైసీపీలో చేరినా బాలకృష్ణ నోట మాటలేదు. అంతే కాదు, పార్టీతోనే పుట్టి ఇంతవరకూ నడచిన కరణం బలరాం, రామసుబ్బారెడ్డి వంటి దిగ్గజ నేతలు వీడిపోయినా ఆయన సౌండ్ చేయడంలేదు. తనకు ఖాతరు చేయని పార్టీ అధినేత బావ అయినా తానెందుకు పట్టించుకోవాలన్నది బాలకృష్ణ ఆలోచన‌గా ఉందంటున్నారు. ఇక టీడీపీ పునాదులతో సహా కూలుతుంటే బాలయ్య మౌన సాక్షిగా ఇపుడు చూస్తున్నారు. ఇది అభిమానులకు బాధగా ఉన్నా వారు కూడా బాలకృష్ణ సైలెంట్ ని సమర్ధించేవారే. పార్టీలో ఏ పాత్రా లేని బాలయ్య ఎందుకు ముందుకు రావాలన్నది అందరి మాటగా ఉంది. మొత్తానికి బావ‌య్య బాబు చేతిలోనే టీడీపీ బతుకు, చితుకూ అన్నీ బాలయ్య స్వయంగా చూస్తున్నాడన్నమాట.

Related Posts