YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం వింతలు నవ్వుకోండి ఆంధ్ర ప్రదేశ్

కరోనాపై జగన్‌ వ్యాఖ్యలు చూసి ప్రపంచం నవ్వుతోంది: వర్ల

కరోనాపై జగన్‌ వ్యాఖ్యలు చూసి ప్రపంచం నవ్వుతోంది: వర్ల

కరోనాపై జగన్‌ వ్యాఖ్యలు చూసి ప్రపంచం నవ్వుతోంది: వర్ల
అమరావతి, మార్చి 18,
కరోనాపై ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యలు చూసి ప్రపంచమంతా నవ్వుతోందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. సీఎం కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడారన్నారు. ఎస్ఈసీ రమేష్‌కుమార్‌ని కులం పేరుతో దూషిస్తారా.. అని వర్ల రామయ్య మండిపడ్డారు.కరోనాపై దేశమంతా అలెర్ట్‌ అయింది కానీ.. సీఎం మొద్దు నిద్ర వీడట్లేదన్నారు. గతంలో పులివెందులలో మాత్రమే దాడులు జరిగేవని.. ఇప్పుడు రాష్ట్రమంతా అరాచకాలు చేస్తున్నారని వర్ల రామయ్య విమర్శించారు. కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారన్నారు. జగనన్నకి గిఫ్ట్‌ ఇస్తామని సీఐ స్థాయి అధికారులు.. బహిరంగంగా ప్రకటించారని వర్ల రామయ్య వెల్లడించారు.

Related Posts