YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆస్తి-పాస్తులు తెలంగాణ

అంతా ఇష్టానుసారమే..

అంతా ఇష్టానుసారమే..

అంతా ఇష్టానుసారమే.. (హైదరాబాద్)
హైదరాబాద్, మార్చి 20
నగరం చుట్టూ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలను  లక్ష్యంగా చేసుకుని స్థిరాస్తి వ్యాపారులు అనధికారికంగా లేఅవుట్లు వేసి అమాయకులకు అంటగడుతున్నారు. నగరంలో స్థలాలకు తీవ్ర కొరత ఉండడంతో కొత్తగా ఇల్లు నిర్మించుకునేవారంతా శివారులోని పట్టణాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ అవసరమే అక్రమార్కులకు వరమవుతోంది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పట్టణ ప్రగతిలో ఇటువంటి బండారాలు బయటపడుతున్నాయి.రంగారెడ్డి జిల్లా పరిధిలోని 12 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటివరకు 548 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. శివారులో వెలుగుచూస్తున్న అక్రమ లేఅవుట్లలో శంషాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. విమానాశ్రయం ఉండటంతో ఇక్కడ భూములకు మంచి ధర పలుకుతోంది. ఈ ప్రాంతంలో 111 జీవో అమల్లో ఉంది. గ్రామకంఠం పరిధి దాటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలుండదు. అయినా కొందరు వ్యక్తులు అధికారులు, రాజకీయ నాయకులతో కుమ్మక్కై అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారు. జిల్లాలోనే అత్యధికంగా 136 లేఅవుట్లు ఇక్కడే ఉన్నాయి. 71,832 ఎకరాల్లో నిర్మాణం చేశారు. ఇక మున్సిపాలిటీలతో పోల్చితే కార్పొరేషన్లలో తక్కువగా ఉన్నాయి. మీర్‌పేట, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్‌ ప్రాంతాల్లో స్థలాల కొరత దృష్ట్యా లేఅవుట్లు ఎక్కువ లేవు. దీంతో ప్రస్తుత సర్వేలో ఇక్కడ తక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఆయా మున్సిపాలిటీలన్నీ హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండడం వల్ల లేఅవుట్‌ వేయాలంటే కచ్చితంగా ఆ సంస్థ అనుమతి తీసుకోవాలి. గతంలో పంచాయతీలుగా ఉన్నప్పుడు సర్పంచుల నుంచి తీసుకున్నట్లుగా నకిలీ దస్త్రాలు సృష్టించి లేఅవుట్లు వేసేస్తున్నారు. అప్పట్లో పనిచేసిన సర్పంచులతో కుమ్మక్కై నకిలీ ప్లాన్లు వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చాలంటే ‘నాలా’ ఫీజు చెల్లించాలి. ఇవన్నీ అక్రమంగా వేసిన లేఅవుట్లు కావడంతో ఆ ఫీజు హుష్‌కాకి అవుతోంది. ః సామాజిక అవసరాల కోసం కేటాయించాల్సిన భూములూ ఆక్రమణకు గురవుతున్నాయి.

Related Posts