YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 మే 26 తర్వాత విశాఖ నుంచే పరిపాలన..?

 మే 26 తర్వాత విశాఖ నుంచే పరిపాలన..?

 మే 26 తర్వాత విశాఖ నుంచే పరిపాలన..?
విజయవాడ, మార్చి 24
విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగ సంఘాలు కూడా సుముఖత వ్యక్తం చేయడంలో వైసీపీ సర్కార్ పని సులువు అయింది. ఉద్యోగులకు గతంలో ఎవరూ ఇవ్వంతగా భారీ రాయితీలు, తాయిలాలు జగన్ సర్కార్ ప్రకటించింది. దాంతో తాము విశాఖ వచ్చేందుకు రెడీ అని సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు తాజాగా ప్రభుత్వానికి తెలియచేశారు. ఇక ఇపుడు మిగిలిన అడ్డంకులు, అవాంతరాలూ దాటుకుని విశాఖకు జగన్ సర్కార్ ఎలా చేరుకుంటుందో అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది.గత డిసెంబర్లో జగన్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ ఆమోదించిన అధికార వికేంద్రీకరణ బిల్లు బంపర్ మెజారిటీతో పాస్ అయింది. శాసనమండలిలో మాత్రం టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుకున్నారు, సెలెక్ట్ కమిటీకు పంపించారు. ఈ క్రమంలో తొంబై రోజుల్లో సెలెక్ట్ కమిటీయే ఏర్పాటు కానందున ఆటోమెటిక్ గా బిల్లు ఆమోదం పొందినట్లేనని వైసీపీ నేతలు అంటున్నారు. మరో వైపు అది ద్రవ్య బిల్లులకే వర్తిస్తుందని, ద్రవ్యేతర బిల్లులకు కాదు కాబట్టి ఇంకా మండలిలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందాల్సిందేనని టీడీపీ అంటోంది. ఈ గొడవ ఆలాగే ఉండగా కర్నూలులో హైకోర్టుకు సంబంధించి ముందుగా అనుబంధ న్యాయ సంస్థలను తరలించాలని జగన్ సర్కార్ ఆదేశించింది. అయితే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళడంతో అక్కడ విచారణ సాగుతోంది.ఇక యావత్తు ప్రపంచం ఇపుడు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. కరోనాకు మందు లేనందున లాక్ డౌన్, షట్ డౌన్ అంటూ ప్రపంచమే మూత వేసుకుంటున్న వేళ రాజధాని షిఫ్టింగ్ వంటి అతి పెద్ద వ్యవహారం సాధ్యపడుతుందా అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఇక అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు అలాగే ఉన్నాయి. వారి కేసులు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో మే నెలాఖరు నాటికి రాజధాని విశాఖకు తరలి వెళ్తుందా అన్నది ఊహకు అందకుండా ఉంది.ఇక జగన్ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ ఏడాది రాజధాని తరలింపు కాకపోతే వచ్చే ఏడాది వరకూ అది వాయిదా పడుతుందని, అంత సుదీర్ఘ సమయం తీసుకుంటే చాలా పరిణామాలు జరిగిపోతాయన్న ఆందోళన వైసీపీ పెద్దల్లో ఉందిట. ఇక సచివాలయ ఉద్యోగులు కూడా మే 31 లోగానే సచివాలయం తరలింపు ఉంటే తాము రాగలమని, లేకపోతే కొత్త విద్యా సంవ‌త్సరం అసలు కదలలేమని చెబుతున్నారుట. దీంతో మే నెలాఖరు డెడ్ ఎండ్ గా ఉంది. మరి ఆ డేట్ కి జగన్ రాజధాని తరలించగలరా? పాలన విశాఖ నుంచి మొదలవుతుందా? అంటే వైసీపీలో అయోమయమే కనిపిస్తోంది. అయితే మే 26న విశాఖ నుంచి పాలన ప్రారంభం అని అనధికార సమాచారంగా ఉంది. దాంతో విశాఖ రాజధానికి కౌంట్ డౌన్ మొదలైనట్లేనని అంటున్నారు.

Related Posts