YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 కరోనా ఎఫెక్ట్ నాలుగోసారి శివరాజ్ ప్రమాణం

 కరోనా ఎఫెక్ట్  నాలుగోసారి శివరాజ్ ప్రమాణం

 కరోనా ఎఫెక్ట్
నాలుగోసారి శివరాజ్ ప్రమాణం
భోపాల్, మార్చి 24
మధ్యప్రదేశ్ రాజకీయాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ముఖ్యమంత్రి పదవికి కమల్ నాధ్ ఇప్పటికే రాజీనామా చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం అధికారికంగా లేనట్లే. అయితే బలం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ బలపరీక్షకు ముందుగానే చేతులెత్తేయడంతో ఇక తదుపరి ప్రభుత్వ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది. అయితే కరోనా ఎఫెక్డ్ పడటంతో కొద్దిగా సందిగ్దం నెలకొని ఉంది.మధ్యప్రదేశ్ లో బలాన్ని నిరూపించుకోవాలని కమల్ నాధ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆయన రాజీనామా చేశారు. అయితే బీజేపీ తమకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అప్పటికే గవర్నర్ లాల్జీ టాండన్ ను బీజేపీ కోరింది. ఈలోపు కరోనా వైరస్ ప్రబలడంతో గవర్నర్ సయితం దానిపై దృష్టి పెట్టారు.అనూహ్య పరిణామాల అనంతరం మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సర్కార్ కొలువుదీరింది. బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్‌ లాల్జీ ఠాండన్‌ ప్రమాణం చేయించారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 2005, 2008, 2013లో ముఖ్యమంత్రిగా పని చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యతతో అధికారం చేపట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక నేత జ్యోతిరాదిత్య సింథియా ఆ పార్టీపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరిపోగా, ఆయనకు మద్దతుగా 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో కమల్‌నాథ్ సర్కార్ కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించారు.కరోనా వైరస్ దృష్ట్యా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌ సింగ్, వినయ్‌ సహస్రబుద్దే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రమాణస్వీకారాన్ని తిలకించారు.కాగా, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన శివరాజ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడపడంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంతో చిత్తశుద్ధి పని చేస్తారని, ఆయనో పరిపాలనా దక్షుడని కొనియాడారు. శివరాజ్ నాయకత్వంలో మధ్యప్రదేశ్ మరిన్ని రెట్లు అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి శివరాజ్ కృత‌జ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసేశారు. తొలుత ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ తర్వాత బలపరీక్ష రోజున మిగిలిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలాన్ని కోల్పోయింది. బీజేపీ 107 మంది సభ్యులతో అతి పెద్ద పార్టీగానూ, మెజారిటీతోనూ ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నీ సిద్ధమయిన తరుణంలో కరోనా షాక్ తగిలింది.అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంది. అధికారులు సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రభుత్వం ఉండాలని అంటున్నారు. దీనిపై గవర్నర్ లాల్జీ టాండన్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని నిర్ణయించారు.  ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం  ఏర్పాటుకు మార్గం సుగమమయింది.

Related Posts