YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 పదవులపై ఆశలు...జ‘గన్‘ ఎవరి వైపో..

 పదవులపై ఆశలు...జ‘గన్‘ ఎవరి వైపో..

 పదవులపై ఆశలు...జ‘గన్‘ ఎవరి వైపో..
విజయవాడ, మార్చి 24,
పీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాను రాను పార్టీ పరంగా ఇబ్బందులు తప్పేట్లు లేవు. మంత్రి పదవుల పంపకంతో పాటు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా వత్తిడి పెరిగే అవకాశముంది. ఇప్పటికే పది నెలల సమయం గడిచిపోయింది. ఇప్పటి వరకూ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు శాసనమండలి రద్దుతో హతాశులయిపోయారు. ఇక నాలుగు రాజ్యసభ పదవులు అప్పటి వరకూ పదవులు అనుభవించిన వారికే జగన్ ఇచ్చేశారు. ఒక్క అయోధ్య రామిరెడ్డి మినహా మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు మంత్రులుగా ఉన్నారు.రాజ్యసభ పదవులు కూడా ఇప్పట్లో భర్తీ అయ్యే అవకాశంలేదు. దీంతో నామినేటెడ్ పోస్టులపై ఎమ్మెల్యేలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటికే జగన్ కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం మిగిలిన పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే గత ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఆరు వారాల పాటు వాయిదా పడటంతో ఆశావహులు నిరాశలో పడ్డారు.దీంతో పాటు ఇతర పార్టీల నుంచి నేతలు వస్తుండటంతో వైసీపీ నేతలు ఆందోళనలో పడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సయితం జగన్ కండువాలు కప్పుతుండటంతో వారికి ఎటువంటి హామీలు ఇస్తున్నారన్న టెన్షన్ వైసీపీ నేతలకు పట్టుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీలు మండలి రద్దయితే పార్టీలో చేరినందుకు ఏదో ఒక నామినేటెడ్ పోస్టు అడితే అవకాశముంది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు సయితం ఇదే ప్రతిపాదన పెట్టే అవకాశముంది. జగన్ పార్టీలో నేతలు ఇబ్బంది పడుతున్నారు. జగన్ వారికి ఏ రకమైన హామీ ఇచ్చారన్న దానిపై ఆ జిల్లాకు చెందిన మంత్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టిక్కెట్లు దక్కని వారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన వారు సయితం ఇప్పుడు తమకు పదవులు దక్కకుంటే భవిష్యత్తులో కష్టమని భావించి జగన్ సన్నిహితుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారిని కలిసి తమ గోడును విన్పిస్తున్నారు. పదవులు తక్కువ ఆశావహుల సంఖ్య ఎక్కువ కావడంతో జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న చర్చ పార్టీలో జరుగుతుంది.

Related Posts