YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

తెలంగాణ100, 104కు ఫోన్‌ చేసినా సకాలంలో స్పందించని వైనం

తెలంగాణ100, 104కు ఫోన్‌ చేసినా సకాలంలో స్పందించని వైనం

తెలంగాణ100, 104కు ఫోన్‌ చేసినా సకాలంలో స్పందించని వైనం
హైదరాబాద్‌, మార్చి 24
ఓ వైపు అనుమానితులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని, వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం, పోలీసులు సూచిస్తున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో అనుమానితులు వెళదామన్నా సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు 100, 104, 108 నెంబర్లకు ఫోన్‌లు చేసినా సరైన స్పందన రావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. కరోనా మహమ్మారిని తరిమి గొట్టేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వాలు ఈ దిశలో కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి.అవసరానికి అనుగుణంగా అంబులెన్స్‌లు ఉన్నాయా... లేకుంటే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. సైదాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆస్పత్రికి వెళదామని 100, 104 నెంబర్లకు ఫోన్‌ చేయగా గంటల తరబడి వాహనం రాలేదు. ఎన్నో గంటల పాటు మలక్‌పేట్‌లో వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండేలా చర్యలపై ప్రభుత్వం ఫోకస్‌ చేయాలి. అనుమానితులు ఉంటే డయల్‌ 100, లేదా 104 నెంబర్లపై సమాచారం అందించాలి.

Related Posts