YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఉగాది, చైత్రం... సంబంధం.....

ఉగాది, చైత్రం... సంబంధం.....

ఉగాది, చైత్రం... సంబంధం.....
మన ఉగాది చైత్ర మాసం తోనే ఎందుకు మొదలవుతుంది అనే ప్రశ్నకు, మన మహర్షలు...
చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహని |
శుక్ల పక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి ||
చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు. అని సమాధానం చెప్పారు. ఇది ఇలా ఉంచితే మన దేశంలో పుష్య, మాఘ మాసాలు పంటలు పండి ప్రకృతి రసభరితంగా ఉండేకాలం. ప్రజలు తమ శ్రమ ఫలితాన్ని కట్టెదుట చూస్తూ పొంగి పోతారు. ఇదే మొదట్లో మన సంవత్సరాది. దీనిని సూచించే దినం మకర సంక్రమణం. ఇది మార్గశిర, పుష్య, మాఘ మాసాల మధ్యన వచ్చేది విషువత్కాలం. విషువత్కాలమంటే పగలూ రాత్రీ సరిసమానంగా ఉండే కాలం. "సమరాంత్రిందివే కాలే విషువత్" అన్నాడు అమరసింహుడు. ఈ విషువత్తులు రెండు.. మకర సంక్రాంత్రి అలాంటి విషువత్తు లలో ఒకటి. ఈనాటి నుంచి ప్రకృతిలో క్రొత్త క్రొత్త మార్పులు కలగడం ఆరంభం అవుతుంది. ఈవిషువత్ నిర్ణయంలోనూ మత బేధం ఉంది. కటకం నుంచి కటక విషువత్ నుంచి దక్షిణాయనం, మకర విషువత్ నుంచి ఉత్తరాయణం ప్రారంభమౌతాయని నేటి సాంప్రదాయం. కాని పూర్వం ఆశ్లేషారధం నుంచి దక్షిణాయనం, ధనిష్థా ప్రథమపాదం నుంచి అంటే అభిజిత్తుతో సహా లెక్కపెడితే కుంభం నుంచి ఉత్తరాయణం, సింహం నుంచి దక్షిణాయనం ఉండేవని ఇప్పుడు అవి కటకాలకు మారాయని వరాహమిహిరుడు బృహత్సంహితలో తెలిపారు. మనకొక సంవత్సరమైతే దేవతలకి అది ఓక దినం. వారి దినం మేషంతో ప్రారంభమౌతోంది, తులతో రాత్రి. కనుక నేడు మకర కటకాల నుంచి ఉత్తర దక్షిణాయనాలు చెబుతారు అని శ్రీ పత్యాచార్యుడు అన్నారు. మనం ఉత్తరధ్రువ ప్రాంతం నుంచి బయలు దేరామనువాదం నిజమైతే, మేషవిషువత్తు నుంచి మనకు దినం ప్రారంభం కావడం 6 నెలలు చీకటి, 6 నెలలు వెలుతురు ఉండే దినం మొదలుకావడం నిజం. మనం ఉత్త్రార్ధగోళం వారం కనుక మేషం లోనే మనకు సూర్యోదయం. భూమధ్య రేఖపై సూర్యుడుండే దినం విషువత్. మానవుడు ఋతువులు తన లెక్కలకు ముందు వెనుకలుగా రావడం చూచి, సూర్యచారాన్ని తక్కిన గ్రహాల చారాన్ని లెక్కలు కట్టసాగాడు. సూర్యుడు విషువత్తులో ప్రవేశించిన నాటి నుంచి లెక్కకట్టి రాసులు విభజించాడు. ఈవిధంగా నభో మండలం 12 భాగాలు అయినది. ఆ రాసుల తోనే మాస సంకేతం చేసుకున్నాడు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడానికి దాదాపు 30, 31 దినాలవుతుంది. కాని చంద్రుని వృద్ధిక్షయాలతో ఏర్పడిన నెలకు, తర్వాత సూర్యమానపు నెలకూ క్రమంగా నెలవారా రావడం మొదలైంది. చంద్రమానానికి 19 సం.లకు ఏడు అదనపు నెలలు చేర్చి రెండు మానాలను సర్దుకోవలసి వచ్చించి. కనుకనే ప్రతి మూడో ఏటా చంద్రమాన సం.లో ఒక అధిక మాసం వస్తూ వుంటుంది. నిజానికి చంద్రమానమే వేదకాలం నుంచి ఆచరణలో ఉన్నదేమో.. సౌరమానం వ్యవహారంలో ఉన్న ప్రాంతాలలోనూ వైదిక కర్మలకు చంద్రమానాన్ని అనుసరించడమే దీని ప్రాచీనతకు ప్రమాణం. అగ్ని పూజకులైన ఫార్సీలు ఎప్పుడో మన నుంచి విడిపోయినవారు. వారి సంవత్సరాది 'నౌరోజ్'. అది కూడా వసంతమాసంలో దాదాపు ఉగాది దరిదాపులలోనే రావడం కూడా చంద్రమానం ప్రాచీనతకు నిదర్శనం. చాళుక్యుల కాలంలో మాత్రం సూర్యమానం ఆంధ్రదేశంలో అధికవ్యాప్తిలో ఉండేదట. ఇప్పుడు మనదేశంలో సౌరమానాన్ని వంగ, తమిళ, కేరళ, పంజాబు, సింధు, అస్సాం వారు అనుసరిస్తున్నారు. మేషవిషువత్తే దైవతదినానికి అంటే సంవత్సరార్ధానికి ప్రారంభమైనప్పుడు భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో సూర్యుడు లంకానగరంలో వసంతఋతువు శుక్లపక్ష ప్రతిపత్తునాడు ఉదయించడం వల్ల (భూ మధ్య రేఖపై ఉండడాన్ని బట్టి) అనాడే ఉగాది అనడం వల్ల సంవత్సరం వసంతర్తుతో ప్రారంభిస్తుందని యజుర్వేదం ఒకవైపు ఘోషిస్తుండగను.. ధర్మసింధు, నిర్ణయసింధు కారులు ఈ ఉగాది పండుగ సంవత్సరాది పండుగ అనడం మాత్రమే కాక, నిర్ణయసింధుకారుడు శుద్ధపాడ్యమి నుంచి అమావాస్య వరకు గల కాలమే నెల అని నిర్ణయించినప్పుడూ వివిధ విధాల సంవత్సరాదులేమిటి.. అనే ప్రశ్న ఉదయిస్తుంది. కాని ఋతునిర్ణయం లోను, సంవత్సరాది నిర్ణయంలోనూ ప్రాచీన కాలంలో వివిధాచారాలున్నాయనడమే దానికి సమాధానం. ఒకప్పుడు కార్తులను బట్టి ఋతు నిర్ణయం జరిగేవి. వేదాంగ జ్యోతిష్ కాలంలో ధనిష్ఠా కార్తితో ప్రారంభమైన శిశిర ఋతువుతో మాఘపూర్ణిమ నుండి రెండు నెలలతో మొదటి ఋతువు సంవత్సరం ప్రారంభమయ్యేది. ఇది ఉత్తరాయణ ప్రవేశ కాలం కూడాను. ఇది పరాశరుడు మతం...
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts

0 comments on "ఉగాది, చైత్రం... సంబంధం....."

Leave A Comment