YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిత్యావసర వస్తువల వాహానాలను అనుమతించాలి

నిత్యావసర వస్తువల వాహానాలను అనుమతించాలి

నిత్యావసర వస్తువల వాహానాలను అనుమతించాలి
విజయవాడ మార్చి 26
కరోనా లాక్ డౌన్ లో భాగంగా నిత్యావసరాలను తెచ్చే వాహనాల రాకపోకలను అనుమతించాలని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యం. టి. కృష్ణ బాబు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ లను, అడిషనల్  ఎస్పీలను సూచించారు. గురువారం విజయవాడ సచివాలయం నుండి లాక్ డౌన్ నేపద్యంలో నిత్యావసరాల సరఫరా, వినియోగదారులకు పంపిణీ లపై మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి,  మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్నలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యం. టి. కృష్ణ బాబు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో రైతు బజార్  లను ప్రాంతాలవారీగా వికేంద్రీకరించి కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్న అంశంపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా అనుమతించాలని అడిషనల్ ఎస్పీ లను సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిత్యావసర  వస్తువులు, కూరగాయల వినియోగదారులకు అందుబాటులో ఉంచి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యవసర వస్తువులు దొరకవన్న ఆందోళన ప్రజల్లో తలెత్తకుండా అన్ని  చర్యలు తీసుకోవడంతో పాటు విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన సూచించారు. గ్యాస్, ఫ్యూయల్, నిత్యావసర వస్తువుల సరఫరా, పంపిణీలపై రోజువారీ నివేదికలు అందజేయాలని వారు ఆదేశించారు. గత  నెలలో వచ్చిన స్టాక్, ప్రస్తుత స్టాక్ లను అన్ని ప్రభుత్వ చౌక దుకాణాలకు చేరవేసి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా వినియోగదారులకు ఈ నెల 29 వ తేదీ నుండి అందించే కార్యక్రమానికి  ఇప్పటినుండే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వీలైన ప్రాంతాల్లో మొబైల్ రైతుబజార్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాధారణ ప్రజానీకానికి కూడా
పెట్రోల్ బంకుల్లో అనుమతించాలని సూచించారు.

Related Posts