YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.. అర్థంచేసుకోండి

చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.. అర్థంచేసుకోండి

చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.. అర్థంచేసుకోండి
మంత్రి పేర్ని నాని
అమరావతి మార్చి 27
కరోనా వైరస్‌తో ప్రపంచమంతా నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు ఇక్కడి ప్రభుత్వ నిస్సహాయతను అర్థంచేసుకొవాలని మంత్రి పేర్ని నాని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా రావాలనుకుంటే మాత్రం 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితే రాష్ట్రంలోకి అనుమతిస్తామని స్పష్టంచేశారు. అంతేగాని ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకు మాత్రం ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేశారు. చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.. ఎక్కడివారు అక్కడే ఉండిపోవడం మంచిదని సూచించారు. పొరుగు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు, డీజీపీలతో సీఎం జగన్, ఇతర ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారని చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మనసు ఉన్నా రాష్ట్రంలోకి అనుమతించలేని పరిస్థితి నెలకొందనీ.. ప్రజలు అర్థంచేసుకోవాలని కోరారు. బయట ఉన్న వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారో, ఎవరు ఎవరిని కలిశారో, వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఏమిటో తెలియదు గనక ఇలాంటి జాగ్రత్తలు తప్పవన్నారు. కరోనా నియంత్రణకు ప్రతి జిల్లా, నియోజకవర్గాల వారీగా టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

Related Posts