YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఇగో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్‌గా..

ఇగో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్‌గా..

 

‘100% లవ్’ సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా నటించి విజయాన్ని సొంతం చేసుకున్నారు నాగచైతన్య. ఇప్పుడు కాలేజీ స్టూడెంట్‌గా మ‌రోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు చైతు. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకి ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుండ‌గా.. శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ ఒక పవర్‌ఫుల్‌ పాత్రలో క‌నిపించ‌నున్నారు.

తన గ‌త సినిమాల్లో కథానాయకులకు “మతిమరుపు”, “అతి శుభ్రత‌” వంటి బలహీనతలను పెట్టి వినోదాన్ని అందించిన‌ మారుతి....ఈ చిత్రంలో నాయకానాయిక‌లిద్దరికి ‘ఇగో’ ఉండేలా పాత్ర‌ల‌ను డిజైన్ చేశార‌ని స‌మాచార‌మ్‌. కాగా, ఈ సినిమాలో చైతు, అను.. క‌ళాశాల విద్యార్థులుగా క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం వీరిపై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీక‌రిస్తున్నారు. గోపీ సుందర్ స్వరాలను అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

Related Posts