YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఫిబ్ర‌వ‌రి 2న నిహారిక చిత్రం

ఫిబ్ర‌వ‌రి 2న నిహారిక చిత్రం

ఒక మ‌నసు'తో క‌థానాయిక‌గా తొలి అడుగు వేసింది మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక‌. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించక‌పోయినా.. త‌మిళంలో ఓ అవ‌కాశం ఆమెని వెదుక్కుంటూ వ‌చ్చింది. ఆ చిత్ర‌మే విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'ఒరు న‌ల్ల నాళ్ పాతు సొల్రేన్‌'. కార్తీక్ త‌న‌యుడు గౌత‌మ్ కార్తీక్ మ‌రొక కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకి ఆర్ముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా, ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. తెలుగులో విజ‌యం అందుకోలేక‌పోయిన నిహారిక‌.. త‌మిళంలో అయినా స‌క్సెస్ అందుకుంటుందేమో చూడాలి. ఇదిలా ఉంటే.. 'హ్యాపీ వెడ్డింగ్' అనే తెలుగు సినిమాలోనూ నిహారిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు.

Related Posts