YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'భాగ‌మ‌తి'.. థీమ్ సాంగ్‌కి టైమ్ ఫిక్స్

'భాగ‌మ‌తి'.. థీమ్ సాంగ్‌కి టైమ్ ఫిక్స్

అనుష్క టైటిల్ రోల్‌లో న‌టించిన చిత్రం 'భాగ‌మ‌తి.' ఆది పినిశెట్టి, జ‌య‌రామ్‌, ఉన్ని ముకుంద‌న్‌, ఆశా శ‌ర‌త్ ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించిన ఈ సినిమాకి అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యువి క్రియేష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడుద‌ల చేసిన 'మందార పాట‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా, ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంట‌ల‌కు 'భాగ‌మ‌తి థీమ్ సాంగ్‌'ని విడుద‌ల చేయ‌నున్నారు. అంతేకాకుండా.. ఈ సినిమా ముంద‌స్తు విడుద‌ల వేడుక (ప్రీ రిలీజ్ ఈవెంట్‌) ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Related Posts